Raju Weds Rambai : సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే.. అమీర్ పేట సెంటర్‏లో అర్ధనగ్నంగా తిరుగుతా.. డైరెక్టర్..

ప్రస్తుతం సినిమా విడుదలైన గంటలోనే రివ్యూస్ బయటకు వచ్చేస్తుంటారు. ఒకరిద్దరు సినిమా ఎలా ఉందో డిసైడ్ చేస్తుంటారు. తాజాగా తన డైరెక్టర్ సాయిలు మాట్లాడుతూ.. తనక సినిమాకు నెగిటివ్ ప్రచారం చేయకండి అని.. 15 ఏళ్లు ఒక జంటకు నరకం చూపించిన కథ అని అన్నారు. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Raju Weds Rambai : సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే.. అమీర్ పేట సెంటర్‏లో అర్ధనగ్నంగా తిరుగుతా.. డైరెక్టర్..
Director Saailu

Updated on: Nov 20, 2025 | 11:17 AM

యంగ్ హీరోహీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫీల్మ్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాను నవంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన సాంగ్స్, ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయిలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాయిలు కంపాటి మాట్లాడుతూ.. ” రాజు వెడ్స్ రాంబాయి సినిమా విషయంలో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. విరాటపర్వం బీజీఎమ్ విని ఎన్నోసార్లు ఏడ్చాను. నా పాత జ్ఞాపకాలన్ని గుర్తు తెచ్చుకున్నాను. బీజీఎమ్ తో పాత జ్ఞాపకాలను గుర్తు చేయగల సత్తా ఉన్న సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి. నేను ఊరోడిని.. ఊరు కథలే రాస్తాను. నేను చూసిన ఊరు.. నేను చూసిన మట్టి మనుషులు.. పొలాల్లో నాటేసే మనసులు.. నాగలు పట్టుకుని దారిలో నడిచే మనుషులు.. అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు.. కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య పుట్టే మొరటి ప్రేమ.. నాకు ఇవే తెలుసు. హెలికాప్టర్, మెట్రో ట్రైన్ దిగొచ్చే ప్రేమ కథలు నేను రాయలేను.. నాకు అది రాదు.. కొత్త కథ చెప్పడానికి వచ్చా ” అని అన్నారు.

అలాగే.. “ఊర్లోకెళ్లి వచ్చి కథ రాసుకున్నా. మిమ్మల్ని హర్ట్ చేస్తే క్షమించండి. దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి. 15 ఏళ్లు ఒక జంటకు నరకం చూపించిన కథను.. ఆ మనుషులను బయటకు తీసుకువచ్చి వాళ్ల కథ చెప్పాలని అనుకున్నాను. మీకు నచ్చకపోతే లైట్ తీసుకోండి. కానీ నెగిటివ్ టాక్ స్ప్రైడ్ చేయకండి. 21వ తేదీన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే.. అమీర్ పేట సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతా.. ఇంత నమ్మకంగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి .. మీరు పొగడకపోయినా పర్లేదు.. కానీ నెగిటివ్ టాక్ మాత్రం తీసుకురాకండి” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

Follow Us