ప్రస్తుతం ఎక్కువగా విపిస్తున్న పేరు ఏఐ టెక్నాలజీ.. అంటే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్. కొన్నిరోజులుగా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోస్, వీడియోస్ రీక్రియేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ముందుగా చెట్లు, పక్షులు మాత్రమే రీక్రియేట్ చేశారు.. కానీ ఇప్పుడు సినీ సెలబ్రెటీలను ఏఐ టెక్నాలజీ ద్వారా రీక్రియేట్ చేస్తున్నారు. గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ, అనుష్క, రష్మిక మందన్నా ఏఐ ఫోటోస్ నెట్టింట ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే హీరో శోభన్ బాబు ఏఐ వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొట్టింది. హాలీవుడ్ హీరో కటౌట్, ఫీచర్స్ తో టాలీవుడ్ సోగ్గాడి ఏఐ లుక్ ట్రెండ్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో ఏఐ వీడియో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అలనాటి టాలీవుడ్ అందగాడు.. దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు.
తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఓ వీడియోను రీక్రియేట్ చేశారు. అందులో హాలీవుడ్ హీరో రేంజ్ ఫీచర్స్ లో కనిపిస్తున్నారు. నవతరం హీరోల హెయిర్ స్టైల్, కండలు, టోన్డ్ ఫేస్, ట్రెండీ దుస్తుల్లో అక్కినేనిని రీక్రీయేట్ చేశారు. ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేస్తూ.. ఏఎన్నార్ ను ఎంతో ఇంటెలిజెంట్ గా క్రియేట్ చేశారని అన్నారు. ప్రస్తుతం అక్కినేని నాగేశ్వరరావు ఏఐ వీడియో వైరలవుతుంది.
INTELLIGENTLY created ARTIFICIAL ANR 🙏 pic.twitter.com/dfRUpKpEGI
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2024
ఇటీవలే శోభన్ బాబు వీడియోను ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో టాలీవుడ్ సోగ్గాడు హాలీవుడ్ హీరోలతో తలదన్నే స్టైల్లో కనిపించాడు. ఇదిలా ఉంటే.. నాగేశ్వర్ రావు తనయుడు అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా రేపు అడియన్స్ ముందుకు రాబోతుంది.
#Akkineni #ANRLivesOn #NaaSaamiRanga @iamnagarjuna @chay_akkineni @AkhilAkkineni8
Ma daivam ANR lives on🙏🙏 pic.twitter.com/O5fTj5pktW— PrakashNagFan (@MatlaPrakash) January 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.