AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసింది.. డైరెక్టర్ ఆర్జీవీ..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాటలకు.. ఆయన చెప్పే ఫిలాసఫీకి యూత్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటారు. అనేక ఇంటర్వ్యూలలో తన సినీ ప్రయాణం గురించి ఆసకక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో పశ్చాత్తాపం లేదని, ప్రతి అనుభవం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని గతంలో ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. అంతం వంటి ఫ్లాప్ చిత్రమే రంగీలా, సత్య వంటి విజయాలకు పునాది వేసిందని ఆయన పేర్కొన్నారు. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోకుండా, వర్తమానంలో జీవించడమే తన లక్ష్యమని తెలిపారు. కోపం, భయం లేకుండా రేషనాలిటీతో వ్యవహరిస్తానని వివరించారు.

RGV: ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసింది.. డైరెక్టర్ ఆర్జీవీ..
Rgv
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2026 | 12:48 PM

Share

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంపై, సినీ ప్రస్థానంపై ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను తన జీవితంలో ఎప్పుడూ ఏ విషయం గురించి పశ్చాత్తాపపడలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి అనుభవం ఒక వ్యక్తిని తీర్చిదిద్దడంలో దోహదపడుతుందని, అది తన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరిచిందని ఆయన వివరించారు. తాను చేసిన పనులను ఇతరులు లేదా తానూ తప్పుగా భావించినా, చివరికి అవి తనకు ఏదో ఒక విధంగా మేలు చేశాయని ఆర్జీవీ పేర్కొన్నారు. తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా ఏదని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, వర్మ అంతం అని సమాధానమిచ్చారు. ఒక జేమ్స్ హాడ్లీ ఛేజ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాను, ఉన్న మెటీరియల్‌ను తాను సరిగ్గా ఉపయోగించుకోలేక చెడగొట్టానని అన్నారు. అయితే ఈ అంతం సినిమానే తన బాలీవుడ్ స్టాండింగ్‌కు మూల కారణమని ఆర్జీవీ వెల్లడించారు. ఈ సినిమా ద్వారానే నటి ఊర్మిళ పరిచయం కావడం, తదనంతరం రంగీలా వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా, అంతం ఆడలేదనే కారణంతో, అదే కథాంశాన్ని విభిన్నంగా మలచి సత్య సినిమాను తెరకెక్కించానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌లో అత్యంత కీలకమైనవని, అవి అంతం మూలంగానే వచ్చాయని ఆర్జీవీ పేర్కొన్నారు. జనాల దృష్టిలో అంతం ఒక ఫ్లాప్ కావచ్చు, కానీ తన విషయంలో అది తన సినీ ప్రస్థానానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు. జీవితంలో క్లైమాక్స్ అనేది మరణం వరకు రాదని, కానీ సినిమాల ద్వారా ఏర్పడిన సంబంధాలు, అనుభవాలు జీవితాంతం కొనసాగుతాయని, అవి తనకు కంటిన్యూయింగ్ అసెట్స్ అని ఆయన అన్నారు. తన తాజా ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ, జగన్ గారిపై తీస్తున్న సినిమా దాదాపు 30 శాతం పూర్తయిందని తెలిపారు. దాని ఫోటోలు కూడా విడుదల చేశానని పేర్కొన్నారు. కోపం అనే భావోద్వేగం తనకు ఎప్పుడూ రాదని వర్మ అన్నారు. కోపం వచ్చేంత ప్రాముఖ్యతను తాను ఎవరికీ ఇవ్వనని, అలాగే తాను ఎప్పుడూ సరైనవాడిని అని నమ్మనని ఆయన వివరించారు. చిరాకు అనేది వస్తుందని, ముఖ్యంగా “స్టుపిడ్ క్వశ్చన్స్” అడిగితే లేదా తన పనికి అడ్డుపడితే చిరాకు వస్తుందని చెప్పారు. చిరాకు, కోపం వేర్వేరు అని, చిరాకు అనేది కేవలం ఇరిటేషన్ అని, కోపం అనేది ఒక ఎమోషన్ అని ఆయన విశ్లేషించారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

తన జీవితానికి ఎటువంటి లక్ష్యం లేదని, జీవితాన్ని సీరియస్‌గా తీసుకోనని ఆర్జీవీ అన్నారు. మనం ఉదయం పుట్టి రాత్రి చనిపోతామని, రేపు ఏమి జరుగుతుందో తెలియదని, నిన్నటి గురించి అయిపోయిందని, ఈరోజును జీవించడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. భయం కూడా తనకు లేదని, తాను ప్రశాంతంగా ఉండనని, ఎల్లప్పుడూ అడ్రినలిన్ రష్‌లో, ఉత్సాహంగా ఉంటానని వర్మ తెలిపారు. భావోద్వేగాల కంటే లాజిక్, రేషనాలిటీతో జీవిస్తానని, ఎందుకంటే ఎమోషన్స్ మనుషులను తప్పుదారి పట్టిస్తాయని, తప్పులు చేయిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!