ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టిస్తోన్న సినిమా ‘హనుమాన్’. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా కథ, కథనం.. విజువల్స్.. యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నింటిలోనూ ఈ మూవీ అదుర్స్ అనిపించుకుంటుంది. ఇప్పుడు భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా. సంక్రాంతికి ఏకంగా నాలుగు చిత్రాలు విడుదల కాగా.. అన్ని చిత్రాలను దాటుకుని భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. పురాణ ఇతిహాసాల్లోని కొన్ని అంశాలను ఎంతో అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించి ఈసారి పండక్కి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించాడు ప్రశాంత్ వర్మ. ఈనెల 12న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 21 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు హనుమాన్ హవా కొనసాగుతుంది.
ఇక రెండో రోజు ఈ సినిమా రూ.12.45 కోట్లు రాబట్టిందని సమాచారం. దేశవ్యాప్తంగా మొత్తం 20.58 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 23.5 కోట్లకు చేరుకుంది. దాదాపు రూ. 25 కోట్లతో రూపొందించిన ఈ సినిమా.. ఇప్పుడు మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం హనుమాన్ సినిమా అనగానే అందరి చూపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పైనే ఉంది. ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన విధానం.. విజువల్స్.. నటీనటుల యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. కథకు డైరెక్టర్ ఎంత న్యాయం చేశాడో.. నటీనటులు కూడా అంతే న్యాయం చేశారు.
ఇక అటు నార్త్ లో హనుమాన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి రోజే రూ. 2 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా అటు రెండో రోజు రూ. 4.05 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీ రూ. 6.20 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ ఆదివారం ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు.
Massive feat achieved by #HANUMAN on @bookmyshow 💥
𝟏𝟎,𝟎𝟎,𝟎𝟎𝟎 Tickets Sold in just 2 Days as everyone witnessed #HanuManRAMpage to the heights 🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha… pic.twitter.com/jsQxo8X4ji— Primeshow Entertainment (@Primeshowtweets) January 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.