
హనుమాన్ సినిమా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. భారతీయ ఇతిహాసాల్లోని సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారని ప్రశంసలు కురిపించారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగున్నాయంటూ రివ్యూస్ వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సంక్రాంతి బరిలో నిలిచిన నాలుగు చిత్రాల్లో అతిపెద్ద విజయాన్ని సాధించింది ఈ మూవీ. ఇందులో యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యార్, సముద్రఖని, వినయ్ రాయ్ కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికీ థియేటర్లలో ఓ రేంజ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూస్ తోపాటు.. నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో హనుమాన్ సినిమాపై అటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే వాటిపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు, నిర్మాత నిరంజన్ రెడ్డికి మధ్య రెమ్యునరేషన్ కు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని రూమర్స్ వైరలయ్యాయి. అయితే నెగిటివ్ రివ్యూ్స్ కు ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు ప్రశాంత్ వర్మ. తాను, నిర్మాత ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోన్ లో ఏదో చూస్తున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇలా నెగిటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నాం. హనుమాన్ స్పిరిట్ ను కొనసాగిస్తున్నామంటూ ఫోటోను పెట్టి ట్వీట్ చేశాడు. దీంతో దర్శకనిర్మాతల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేశాడు.
ఈ చిత్రాన్ని దాదాపు రెండు మూడేళ్లు నిర్మించామని గతంలోనే చిత్రయూనిట్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా హీరో తేజా సజ్జా ఈ మూవీ కోసం దాదాపు 75 చిత్రాలను రిజెక్ట్ చేశానని అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది ఈ మూవీ. మార్చిలో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddy pic.twitter.com/2O5J6BqwPH
— Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.