Prashanth Neel : సలార్ సిక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. గట్టిగా చెప్పేస్తానంటూ..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వస్తోన్న చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). ఎన్నో అంచనాల

Prashanth Neel : సలార్ సిక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. గట్టిగా చెప్పేస్తానంటూ..
Prashanth Neel

Updated on: Apr 13, 2022 | 6:36 AM

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వస్తోన్న చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 14న) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ కేజీఎఫ్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‏లో నిర్వహించిన ప్రెస్ మీట్‏లో హీరో యశ్‏తోపాటు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

గత కొద్ది రోజులుగా ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాకు సిక్వెల్ ఉంటుందని… పార్ట్ 2 అంటూ పలు రకాల వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కేజీఎఫ్ ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్.. సలార్ పార్ట్ 2 ఉంటుందా ? అని ప్రశాంత్ నీల్‏ను ప్రశ్నించాడు. దీంతో డైరెక్టర్ స్పందిస్తూ.. అసలు ఇక్కడ సలార్ చర్చే వద్దు సార్… అయినా అలాంటిదేమీ ప్లాన్ చేయలేదు. ఒకవేళ చేస్తే గట్టిగా అందరికీ చెప్పేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సలార్ సిక్వేల్ పై క్లారిటీ ఇచ్చేశాడు. సలార్ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Also Read: Beast VS KGF Chapter 2 : తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ పై కన్నేసిన బడా మూవీస్..

Trivikram Srinivas: ఓ వైపు సూపర్ స్టార్.. మరో వైపు పవర్ స్టార్.. గురూజీ మాస్టర్ ప్లాన్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్డేట్

Ravi Teja: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న మాస్ మాహారాజా.. హైవోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో రవితేజ