Rakesh Master: రాకేష్ మాస్టర్ నటించిన చివరి సినిమా ఇదే.. ఆయన నటనకు ఫిదా అయిన దర్శకుడు

|

Jan 07, 2024 | 3:03 PM

ఇండస్ట్రీకి దూరం అయిన తర్వాత పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫెమస్ అయ్యారు. సఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్లు ఒకప్పుడు ఆయన శిష్యులే.. అయితే మద్యానికి బానిసైన రాకేష్ మాస్టర్ గత ఏడాది కన్నుమూశారు. యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఇంటర్వ్యూలు చేయడంతో రాకేష్ మాస్టర్ కు మంచి పేరు వచ్చింది.

Rakesh Master: రాకేష్ మాస్టర్ నటించిన చివరి సినిమా ఇదే.. ఆయన నటనకు ఫిదా అయిన దర్శకుడు
Rakesh Maste
Follow us on

రాకేష్ మాస్టర్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఒకప్పుడు కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోలకు పని చేశారు. కానీ ఆతర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయిన తర్వాత పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫెమస్ అయ్యారు. సఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్లు ఒకప్పుడు ఆయన శిష్యులే.. అయితే మద్యానికి బానిసైన రాకేష్ మాస్టర్ గత ఏడాది కన్నుమూశారు. యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఇంటర్వ్యూలు చేయడంతో రాకేష్ మాస్టర్ కు మంచి పేరు వచ్చింది. అలాగే జబర్దస్త్ లాంటి షోల్లోనూ కనిపించి మెప్పించారు. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చాడు. స్టార్ నటీనటుల పై వివాదాస్పద కామెంట్స్ చేశారు.

రాకేశ్‌ మాస్టర్‌ విశాఖలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని హైదరాబాద్‌ తిరిగొచ్చిన తరువాత అస్వస్థతకు గురై 2023 జూన్ 18న మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. డయాబెటిస్‌ పేషెంట్‌ కావడంతో పాటు సివియర్‌ మెటాబాలిక్‌ ఎసిడోసిస్‌ కావడంతో మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ కావడంతో పరిస్థితి విషమించి మరణించారు. ఆయన నటించిన చివరి సినిమా హనుమాన్.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. హనుమాన్ సినిమాలో రాకేష్ మాస్టర్ ఓ ఇంట్రెస్టింగ్ పాత్ర పోషించారు. ఇదే విషయం దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్ నటించిన లాస్ట్ సినిమా ఇది. ఈ సినిమాలో ఆయన ఓ చక్కటి పాత్ర పోషించారు. ఆయన నటన చూసి ఈయనకు ఇప్పటి నుంచి మంచి ఆఫర్స్ వస్తాయి అని అనుకున్నాను కానీ ఇంతలో ఆయన మరణించారు అని తెలిపాడు ప్రశాంత్ వర్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.