Nandini Reddy: ఆ సినిమా హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేకపోతున్నా.. ఆ సినిమా రూ.500 కోట్లు కొట్లాల్సింది.. కానీ..

దర్శకురాలు నందిని రెడ్డి మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగులో విభిన్న కథలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ కొన్నాళ్లుగా ఆమె తెరకెక్కించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు.

Nandini Reddy: ఆ సినిమా హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేకపోతున్నా.. ఆ సినిమా రూ.500 కోట్లు కొట్లాల్సింది.. కానీ..
Nandini Reddy

Updated on: Jun 13, 2026 | 10:16 AM

సినీరంగంలో లేడీ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేశారు నందినీ రెడ్డి. అలా మొదలైంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత ఓ బేబీ మూవీతో మరోసారి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దర్శకురాలిగా తనను పట్టిపీడిస్తున్న రెండు ఫిర్యాదులను ఆమె ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఒకటి, సినిమా కథల కోసం ఎక్కువ సమయం తీసుకోవడం, రెండోది, పరిశ్రమలో ఎంతో మంది హీరోలు తెలిసినా వారిని సంప్రదించకపోవడం. దీనికి నందిని రెడ్డి స్పందిస్తూ, ఒక కథను రాయడానికి తనకు ఆరు నుండి ఏడు నెలలు పడుతుందని, ఆ సమయానికి హీరోలు వేర్వేరు ప్రాజెక్టుల్లో, వేర్వేరు ఫేజులలో ఉంటారని వివరించారు. తన దృష్టిలో కథే హీరో అని, కథను ఎవరికీ తగ్గట్టు మార్చడం తనకు నచ్చదని ఆమె తెలిపారు. హీరోల చుట్టూ కథను అల్లుకోవడం కాకుండా, కథకు తగిన నటులను ఎంచుకోవడమే తన పంథా అన్నారు. తనకు అహంకారం ఏమీ లేదని, తాను రాసిన కథలను హీరోలు మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తిరస్కరించారని, అది సాధారణమేనని అన్నారు. ఈ తిరస్కరణల వల్ల కొన్నిసార్లు తన కథలు మరింత మెరుగుపడ్డాయని ఆమె అంగీకరించారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

తన కెరీర్‌లో జబర్దస్త్ చిత్రం ఒక పెద్ద దెబ్బ అని, అది తనకు తాను వేసుకున్న రాడ్ దెబ్బ లాంటిదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం తనను వెనక్కి లాగిందని, అయితే కళ్యాణ వైభోగమే చిత్రంతో తాను మళ్లీ మొదలుపెట్టగలిగానని తెలిపారు. అన్నీ మంచి శకునములే చిత్రం తనకు గర్వకారణమని, అందులో లోపాలు ఉన్నప్పటికీ, దానిలోని బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్‌లు, క్యారెక్టర్లు, క్లైమాక్స్ తనకు నచ్చాయని అన్నారు. అయితే ఆడియన్స్ థియేటర్‌కు రాకపోవడం, కథలోని కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం తన ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంతో ప్రేక్షకులు తన తరహా కథలను కూడా ఎక్సైటింగ్ వేలో చెప్పవచ్చని నిరూపించాలనే ప్రయత్నంలో ఉన్నానని ఆమె అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

సప్తసాగరదాచే ఎల్లో చిత్రం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని, మూడు రోజుల పాటు ఆ సినిమా హ్యాంగోవర్ నుంచి బయటపడలేదని నందిని రెడ్డి తెలిపారు. ఆ సినిమా చూసిన తర్వాత, అలాంటి లోతైన ప్రేమకథను తీయాలని తనకు బలంగా అనిపించిందని చెప్పారు. అయితే ఈ జనరేషన్‌కు ప్రేమకథ చెప్పడం చాలా సంక్లిష్టమని, ఎందుకంటే ప్రేమ నిర్వచనం మారిపోయిందని, రిలేషన్‌షిప్‌లు కాంప్లెక్స్‌గా మారాయని అన్నారు. పాత కాలపు అమాయకత్వాన్ని తెరపై చూపించడం వల్ల కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. సప్తసాగరదాచే ఎల్లో వంటి గొప్ప సినిమాకు వాణిజ్య విజయం లభించకపోవడంపై తాను బాధపడ్డానని, అది ఐదు వందల కోట్లు వసూలు చేయాలని తాను ఆశించానని నందిని రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కూడా అది గొప్ప సినిమాల జాబితాలో నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..

Follow Us