నాకొక హీరో కావాలి !

|

Oct 20, 2020 | 6:04 PM

ప్రముఖ దర్శకుడు మారుతికి ఇప్పుడు హీరో దొరకడం లేదు. అతడి గత సినిమా ప్రతి రోజూ పండగే హిట్టైనా కూడా సరైన హీరోని లాక్ చేయలేకపోతున్నాడు. 

నాకొక హీరో కావాలి !
Follow us on

ప్రముఖ దర్శకుడు మారుతికి ఇప్పుడు హీరో దొరకడం లేదు. అతడి గత సినిమా ‘ప్రతి రోజూ పండగే’ హిట్టైనా కూడా సరైన హీరోని లాక్ చేయలేకపోతున్నాడు.  అల్లు అర్జున్, రామ్,  బెల్లంకొండ సాయి శ్రీనివాస్  ఇలా చాలామందిని కాంటాక్ట్ అయినప్పపటికీ ప్రాజెక్ట్ మాత్రం ఫైనల్ అవ్వలేదు. అయితే అందరూ బిజీ అయిపోయి కాల్షీట్లు ఇవ్వలేకపోతున్నారా..? లేక మారుతి కథ నచ్చడం లేదో తెలియడం లేదు. అయినా మారుతిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన కెరీర్ తొలినాళ్లలో కొత్త వాళ్లతో సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్నారు. మొదట తాను నిలబడటానికి అడల్ట్ కంటెంట్ సినిమాలు తీసినా, తర్వాత మంచి కమర్షియల్ సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇక మరికొన్ని రోజులు చూసి..సరైన హీరో దొరక్కపోతే మారుతి మళ్లీ కొత్త వాళ్లతో తానే నిర్మిస్తూ  సినిమా అనౌన్స్ చేసినా ఆశ్చర్యం లేదు. కాగా ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లు యూత్ ని అట్రాక్ట్ చేసే వెబ్ సీరీసులు కూడా ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

Also Read :

Bigg Boss Telugu 4 : అరియానాకు పెరుగుతోన్న ఫాలోయింగ్ !

Hyderabad Floods : ఎన్ని కష్టాలు వచ్చాయ్ బ్రదర్ !