
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. హీరో ప్రభాస్ తో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. కాగా ఈ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి చాలా ఎమోషనల్ అయ్యాడు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ ను పెట్టేశారు. . రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నాం. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుంది. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదు’ అంటూ వేదికపైనే ఏడ్చేశాడు మారుతి. దీంతో ప్రభాస్ స్వయంగా స్టేజ్ పైకి వచ్చి డైరెక్టర్ ను ఓదార్చారు.
కాగా ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మారుతి కూతురు హియా కూడా హాజరైంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు.
కాగా మారుతీ కూతురు పేరు హియా. తండ్రిలాగే ఈమె కూడా మంచి టాలెంటెడ్ అని తెలుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ లో హియాకు మంచి ప్రావీణ్యముంది. దీంతో పాటు ఆమె ఫోటోగ్రఫీ, బొమ్మలు గీయడంలో కూడా ఎంతో ప్రతిభావంతురాలని సమాచారం. ఆమె ఫోటోగ్రఫీ ఫ్రేమ్స్ అండ్ ఆమె స్వయంగా గీసిన స్కెచెస్‌తో ఇప్పటి వరకు ఎన్నో ఎగ్జిబిషన్స్ నిర్వహించారట. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దాసరి హియ సినిమాల్లోకి వస్తుందో? రాదో? చూడాలి.
.@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU
— Rebel Star (@Pranay___Varma) December 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.