ఇటీవల విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమా మరో లెవల్‌కు వెళ్లిందనే చెప్పుకొవాలి. అంతేకాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా లోకేష్ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు లోకేష్.
” హే గాయ్స్.. నేను అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నేను నా నెక్ట్స్ సినిమా అనౌన్స్ మెంట్ తో తిరిగి వస్తాను. అప్పటి వరకు అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమతో మీ లోకేష్.” అంటూ ట్వీట్ చేశాడు. మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రూపొందించి దక్షిణాదిలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం లోకేష్ తన తదుపరి సినిమా విజయ్ దళపతితో చేస్తున్నాడు. ఇటీవలే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం విజయ్ వరిసు చిత్రీకరణలో ఉన్నాడు. త్వరలోనే విజయ్, లోకేష్ కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
Hey guys ✨
I’m taking a small break from all social media platforms…
I’ll be back soon with my next film’s announcement ?
Till then do take care all of you..
With love
Lokesh Kanagaraj ????— Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 1, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.