డైరెక్టర్ లీనా మణిమేకల దర్శకత్వం వహిస్తున్న కాళీ(Goddess Kali) డ్యాక్యూమెంటరీ పై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యూమెంటరీ నుంచి కాళీ మాత పోస్టర్ విడుదల కావడంతో అందులో కాళీ చేతిలో సిగరెట్ ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. అమ్మవారి చేతిలో సిగరెట్ ఉండడం ఏంటీ అంటూ డైరెక్టర్ లీనా పై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల డైరెక్టర్ లీనా పై కేసులు నమోదయ్యాయి. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అయితే కాళీ మాత సిగరెట్ పట్టుకోవడంలో తప్పేముందని హిందుత్వ సంఘాలను తిరిగి ప్రశ్నిస్తున్నారు లీనా. కాళీ మాత పోస్టర్‌పై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ లీనాకు ట్విట్టర్ షాకిచ్చింది. కాళీ మాత సినిమా పోస్టర్ వివాదంలో డైరెక్టర్ లీనాపై ట్విట్టర్ చర్యలు తీసుకుంది. లీనా చేసిన కాళీ మాత్ పోస్టర్ ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది. కాళీ మాతను అవమానించిందని.. ఆ పోస్టర్ తో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఆమె చేసిన పోస్ట్ ను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. దీంతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. లీనాకు సంబంధించిన ట్వీట్ జూలై 5 నుంచి కనిపించడం లేదు.
అయితే తన ట్వీట్ డెలిట్ పై డైరెక్టర్ లీనా ఇంకా స్పందించలేదు. ఆమె ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. ఆమెకు తమిళనాడులో సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇప్పటికే అనేక డాక్యుమెంటరీలకు లీనా దర్శకత్వం వహించింది. ఆమె చేసిన ఎన్నో డాక్యుమెంటరీలు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..