అందుకే ఆయన సూపర్ స్టార్..! ఆరోగ్యం బాలేకున్నా నీళ్లలోనే సాంగ్, ఫైట్ చేసిన మహేష్ బాబు..

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

అందుకే ఆయన సూపర్ స్టార్..! ఆరోగ్యం బాలేకున్నా నీళ్లలోనే సాంగ్, ఫైట్ చేసిన మహేష్ బాబు..
Mahesh Babu

Updated on: Oct 06, 2025 | 11:26 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పై మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందని తెలుస్తుంది. అలాగే మరికొంతమంది స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలనీ 120కి పైగా దేశాల్లో సినిమాను రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ లో మహేష్ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమా కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారన్న విషయం తెలిసిందే.. ఓ సినిమాలో ఫైట్ సీన్ కోసం తీవ్ర జ్వరంలోనూ నీళ్లల్లో ఫైట్ చేశారట మహేష్.. ఆ సినిమా ఎదో తెలుసా.. ?

ఇది కూడా చదవండి :ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?

మురారి.. మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ఇది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీని ఇటీవలే రీ రిలీజ్ లో చేశారు కూడా.. ఫ్యాన్స్ మరోసారి మురారి సినిమాను థియేటర్స్ లో తెగ ఎంజాయ్ చేశారు.. మురారి థియేటర్ లో ఓ ఫ్యాన్ జంట పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది.అలాగే పలు థియేటర్స్ లో అభిమానులు అక్షింతలు కూడా పంచుకుంటూ సినిమాలో పెళ్లి సీన్ రాగానే అక్షింతలు కూడా చల్లారు. ఇదిలా ఉంటే మురారి సినిమాలో మహేష్ బాబు ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడరట.. ఆరోగ్యం బాలేకున్నా సినిమా కోసం షూటింగ్ లో పాల్గొన్నారట మహేష్. ఈ విషయాన్నీ దర్శకుడు కృష్ణవంశీ పలు సందర్భాల్లో చెప్పారు.

ఇది కూడా చదవండి :ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..

కృష్ణవంశీ  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మురారి సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మురారి సినిమాలో ఫస్ట్ ఫైట్ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో మహేష్ కు ఇష్టమైన ఏనుగును రవిబాబు కిడ్నప్ చేసే సీన్ ఉంటుంది. ఆ ఏనుగును కాపాడే ప్రయత్నంలో విలన్స్ తో మహేష్ ఫైట్ చేస్తాడు. గోదావరి నీటిలో ఈ ఫైట్ సీన్ ఉంటుంది. అయితే ఆ ఫైట్ సీక్వెన్స్ చేసే సమయంలో మహేష్ కు తీవ్ర జ్వరం . అంత  జ్వరంతో ఉన్నా కూడా మహేష్ ఆ ఫైట్ సీక్వెన్స్ చేసాడట.. అయితే ఈ ఫైట్ కు ముందు ఓ సాంగ్ కూడా ఉంటుంది. ఈ సాంగ్ కూడా నీళ్లలోనే ఉంటుంది. జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా నిర్మాతకు నష్టం రాకూడదని మహేష్ ఆ షూటింగ్ చేశారట. మహేష్  డెడికేషన్ కు ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటున్నారు ఫ్యాన్స్. ఇదే కాదు మహేష్ బాబు తన సినిమాల్లో చాలా సాహసాలు కూడా చేశారు. అందుకే ఆయనను డైరెక్టర్ హీరో అంటుంటారు.

ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.