AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీక్వెల్‌కు సిద్దమవుతున్న మంగళవారం.. హీరోయిన్ గా నటించేది ఈమేనా..!

ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ చాలా సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ మాత్రం పడలేదు. అయితే తనను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టరే మళ్లీ ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా మంగళవారం

సీక్వెల్‌కు సిద్దమవుతున్న మంగళవారం.. హీరోయిన్ గా నటించేది ఈమేనా..!
Mangalavaram
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 10:06 AM

Share

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అజయ్ చేసింది మూడు సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మహాసముద్రం అనే మల్టీస్టారర్ సినిమా చేశాడు. శర్వానంద్, సిద్దార్థ్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న అజయ్.. మంగళవారం అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్ పుత్ నటించింది.

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

మంగళవారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కొత్త పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాయల్ తన నటనతో ఆకట్టుకుంది. ఒక అరుదైన మానసిక స్థితి కలిగిన యువతిగా ఆమె నటన ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో అజయ్ మరోసారి దర్శకుడిగా సత్తా చాటారు. ఇక ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

ఇదిలా ఉంటే శ్రీనివాస్ మంగాపురం సినిమా తర్వాత అజయ్ మంగళవారం సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. మంగళవారం సినిమా సీక్వెల్ కోసం అజయ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి కొరటాల శివ ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. అయితే మంగళవారం సినిమా సీక్వెల్ లో ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ సినిమా సీక్వెల్ లో శ్రీలీల నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై ఎలాంటి క్లారిటీ లేదు. మరి మంగళవారం సీక్వెల్ సినిమా కోసం కొత్త భామను తీసుకుంటారా.? లేక తెలిసిన హీరోయిన్ తోనే సినిమా చేస్తారా అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..