Arthi Agarwal: ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన హీరోయిన్ ఆర్తిక అగర్వా్ల్. అప్పట్లో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె అమాయకపు చూపులు, చురుకైన నటన, గ్లామర్‌తో టాలీవుడ్‌ను షేక్ చేసింది. తెలుగులో అందరి హీరోలతో నటించిన ఆర్తి అగర్వాల్.. ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. చిన్న వయసులోనే ఆమె చనిపోవడం సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది.

Arthi Agarwal: ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..
Aarthi Agarwal

Updated on: May 28, 2026 | 6:08 PM

దర్శకుడు కాశీ విశ్వనాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగానూ సుపరిచితమే. ఎన్నో హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే తన కామెడీ టైమింగ్, నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. అయితే ఒఖప్పుడు ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివంగత నటి ఆర్తి అగర్వాల్‌తో తన అనుబంధం, ఆమె కెరీర్, చివరి రోజులు మరియు సినీ పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఆర్తి అగర్వాల్ అప్పట్లో నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, ఇంద్ర, వసంతం వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, ఒక ప్రత్యేక ట్రెండ్‌ను సృష్టించి అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఆమె వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ, ఆర్తి అగర్వాల్ మంచి మనస్తత్వం గల అమ్మాయి అని, ఆమె తండ్రి ఆమె కెరీర్‌ను ముందుండి నడిపించారని కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. చిన్న వయసులోనే సినీ రంగంలోకి వచ్చిన ఆర్తి, అకస్మాత్తుగా పతనం చెందడం వెనుక పలు ఊహాగానాలు ఉన్నాయని, కొందరు ఇండస్ట్రీ మిస్‌గైడ్ అంటారని, మరికొందరు ప్రేమ వైఫల్యం అంటారని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

అయితే, ఆయన ప్రకారం, ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకున్న తర్వాత ఆమె శరీర ఆకృతి మారిపోయిందని, తిరిగి నటించాలనే కోరికతో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునే ప్రయత్నంలోనే దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారాన్ని ఆయన ఊహాగానాలుగా కొట్టిపారేశారు. ముంబైలో జరిగిన సంఘటన గురించి వాస్తవాలు ఎవరికీ తెలియవని అన్నారు. నువ్వు లేక నేను లేను చిత్రం షూటింగ్ సమయంలో ఆర్తి అగర్వాల్, తరుణ్ మధ్య ఏర్పడిన చిన్నపాటి అలకను తాను ఎలా పరిష్కరించారో కాశీ విశ్వనాథ్ వివరించారు. వారిద్దరూ మాట్లాడుకోని సమయంలో, పాట చిత్రీకరణ బాగా జరగాలనే ఉద్దేశ్యంతో వారి మధ్య సయోధ్య కుదిర్చి, స్నేహితులుగా మార్చడంలో తాను పాత్ర పోషించినట్లు చెప్పారు. అలాగే, సురేష్ బాబు సూచన మేరకు, ఆర్తి అగర్వాల్‌కు తెలుగు సరిగా రాకపోవడంతో నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆమెకు డైలాగులు నేర్పించడంలోనూ తాను సహాయపడినట్లు గుర్తు చేసుకున్నారు. ఆర్తి అగర్వాల్ సానుకూల దృక్పథం గల వ్యక్తి అని, ఆమెలో ఎటువంటి సంక్లిష్టత ఉండేది కాదని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆర్థికంగా మంచి ప్రణాళిక చేసుకోవడం ఆవశ్యకతను కాశీ విశ్వనాథ్ చెప్పారు. మోహన్ బాబు, మురళీ మోహన్, శోభన్ బాబు, చంద్రమోహన్ వంటి సీనియర్ నటులు చెప్పినట్లుగా, సక్సెస్ ఉన్నప్పుడే “నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి” అని, మనిషిని నమ్మడం కంటే “భూమిని నమ్మితే” (రియల్ ఎస్టేట్) బాగుంటుందని ఆయన సూచించారు. తాను కూడా పరిశ్రమకు రాకముందే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నానని, తనకు దురలవాట్లు లేవని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Loading...
Unable to load recommendations.
Follow Us