Kalyan Krishna: బంగార్రాజు డైరెక్టర్‏కు భారీ ఆఫర్.. తమిళ్ ప్రొడక్షన్ నిర్మాణంలో..

అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి కీలకపాత్రలలో నటించగా..

Kalyan Krishna: బంగార్రాజు డైరెక్టర్‏కు భారీ ఆఫర్.. తమిళ్ ప్రొడక్షన్ నిర్మాణంలో..
Kalyan Krishna

Updated on: Jan 17, 2022 | 8:35 AM

అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి కీలకపాత్రలలో నటించగా.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సిక్వెల్‏గా రూపొందిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్.

ప్రముఖ తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ నిర్మాణంలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మరో భారీ ప్రాజెక్ట్ రూపొందబోతుంది. ఈ సందర్బంగా కళ్యాణ్ కృష్ణను కలిసిన కెఇ జ్ఞానవేల్ రాజా ఆయన బంగార్రాజు సినిమా సాధించిన విజయం గురించి అభినందించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మేము తెలుగు సంక్రాంతి బ్లాక్ బస్టర్ బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్మతో అతని తదుపరి భారీ వెంచర్ కోసం కలిసి పని చేయబోతున్నాము. మరిన్ని వివరాలు త్వరలో అంటూ గ్రీన్ స్టూడియో ప్రకటించింది. బంగార్రాజు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు.

Also Read: Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

 

Loading...
Unable to load recommendations.
Follow Us