K Viswanath Passed Away Live: ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు.. కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు

| Edited By: Rajitha Chanti

Feb 03, 2023 | 3:54 PM

మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వి శకం ముగిసింది. సినీ దిగ్గజం, ప్రముఖ దర్శడు కె.విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న విశ్వనాథ్‌..

K Viswanath Passed Away Live: ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు.. కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు
K Viswanath

మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వి శకం ముగిసింది. సినీ దిగ్గజం, ప్రముఖ దర్శడు కె.విశ్వనాథ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న విశ్వనాథ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురువారం రాత్రి 11గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. విశ్వనాథ్‌ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Feb 2023 03:11 PM (IST)

    ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు..

    కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వర​కు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

  • 03 Feb 2023 03:04 PM (IST)

    ఇక సెలవు.

    పంజాగుట్ట శ్మశాన వాటికలో కె విశ్వనాధ్ పార్థీవ దేహానికి ఖననం నిర్వహించారు కుటుంబసభ్యులు. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం కళాతపస్వికి అంత్యక్రియలు నిర్వహించారు.

  • 03 Feb 2023 02:41 PM (IST)

    విశ్వనాథ్ పార్థివదేహం చూసి బోరున విలపించిన చంద్రమోహన్.

    దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ పార్థివదేహం చూసి బోరున విలపించారు సీనియర్ నటుడు చంద్రమోహన్. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కళాతపస్విని చివరిచూపు చూసేందుకు వచ్చాయి. సిరిసిరిమువ్వు సినిమాతో తన కెరీర్ మలుపు తిప్పిన డైరెక్టర్ విశ్వనాథ్ పార్ధివ దేహం చూసి చలించిపోయారు. వెక్కి వెక్కి ఏడ్చారు.

  • 03 Feb 2023 02:06 PM (IST)

    నా గురువు విశ్వనాథ్ గారు.. అనిల్ కపూర్..

    మీతో ఎక్కువ సమయం సెట్ లో ఉండడమంటే గుడిలో దేవుడితో ఉన్నట్లే అనిపించేది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి గురువుగారు. అంటూ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్.

  • 03 Feb 2023 01:46 PM (IST)

    కళాతపస్వి ఆఖరియాత్ర ప్రారంభం..

    కళాతపస్వి ఆఖరియాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో చేయనున్నారు.

  • 03 Feb 2023 01:34 PM (IST)

    సమాజానికి ఆయన చక్కని సందేశం అందించారు.. తలసాని శ్రీనివాస యాదవ్..

    ‘విశ్వనాథ్‌గారు తీసిన చిత్రాల ద్వారా సమాజానికి చక్కని సందేశం అందించారు. ఆయన సినిమాలు చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇండస్ర్టీలో ఎన్నో జానర్ల సినిమాలొచ్చాయి కానీ.. ఆయన తీసిన సినిమాలు ప్రత్యేకం. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు మంచి పట్టుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేక స్థానం. ఆయన లేని లోటు తీరనిది. అంత్యక్రియలు… అధికార లాంఛనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.

  • 03 Feb 2023 01:15 PM (IST)

    సినిమా ఉన్నంతకాలం ఆయన ప్రభావం ఉంటుంది.. మహేష్ బాబు..

    సంస్కృతి, సినిమాలకు అద్భుతంగా కలగలిపిన జీనియస్ కె. విశ్వనాథ్ గారు. సినిమా ఉన్నంత కాలం ఆయన ప్రభావం ఉంటుంది. విశ్వనాధ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిమ్నల్ని చాలా మిస్ అవుతున్నాం. విశ్వనాథ్ కుటుంబానికి.. ఆయనను ప్రేమించేవారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

  • 03 Feb 2023 12:53 PM (IST)

    కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్..

    కాసేపట్లో ఫిలింనగర్ లోని విశ్వనాథ్ నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. కళాతపస్వి పార్థివ దేహానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పంజాగుట్ట శ్మశానవాటికలో కాసేపట్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. విశ్వనాథ్ మృతికి సంతాపంగా ఈరోజు షూటింగ్ లను స్వచ్ఛందంగా ఆపేశారు.

  • 03 Feb 2023 12:19 PM (IST)

    కళాతపస్వి విశ్వనాథ్ మృతికి చంద్రబాబు తీవ్ర సంతాపం..

    కళాతపస్వి విశ్వనాథ్ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

  • 03 Feb 2023 12:16 PM (IST)

    కళాతపస్వి మరణం పై ఇళయరాజా ఎమోషనల్..

    ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యమైన.. ప్రధాన స్థానంలో ఉన్న డైరెక్టర్ విశ్వనాథ్. ఆయన దేవుడి పాదాల చెంతకు వెళ్లారని తెలిసి చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు.

     

  • 03 Feb 2023 12:09 PM (IST)

    ఖాకీ డ్రెస్ వెనుక కథ ఇదే..

    రసౌండ్ రికార్డిస్టుగా ఉండి దర్శకుడిగా మారాను. ఆ గర్వం తలకు ఎక్కకూడదనే తన సెట్ లో పనిచేసే కార్మికులతోపాటు.. తను కూడా ఖాకీ డ్రెస్ ధరించేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విశ్వనాథ్.

  • 03 Feb 2023 11:46 AM (IST)

    చివరివరకు కళామతల్లి సేవలోనే కళాతపస్వి..

    మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ.. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమని చెప్పారట. ఆయన రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారట. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు.

  • 03 Feb 2023 11:29 AM (IST)

    విశ్వనాధ్ మరణంపై రాజమాళి భావోద్వేగం..

    ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. Your signature on Telugu Cinema &art in general will shine brightly forever. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తం రుణపడి ఉంటాము సర్ అంటూ ట్వీట్ చేశారు.

  • 03 Feb 2023 10:55 AM (IST)

    విశ్వనాథ్ మరణంపై ప్రధాని మోదీ ట్వీట్..

    కే విశ్వనాథ్‌గారు మృతి చెందడం బాధాకరం. ఆయన సినీ ప్రపంచంలో ఓ ప్రముఖుడు. తన సృజనాత్మకతతో పాటు బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న వ్యక్తి. వివిధ శైలిలో తెరకెక్కిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

  • 03 Feb 2023 10:34 AM (IST)

    కళా తపస్వి చిత్రాలు.. వెండితెరపై మెరిసిన స్వర్ణ కమలాలు..

    తెలుగు సినిమా స్థాయినీ.. తెలుగు దర్శకుల సృజనాత్మకతను ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక సృష్టి శ్రీ కె.విశ్వనాథ్ గారు శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

  • 03 Feb 2023 10:29 AM (IST)

    సెల్యూట్ మాస్టర్.. కమల్ హాసన్ ఎమోషనల్..

    కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబోలో సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. “కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు జీవిత పరమార్థం, కళలకు ఉండే అమరత్వం గురించి ఎంతో అర్ధం చేసుకున్నారు. అందుకే ఆయన కళాతపస్వి సృష్టించిన కళ. ఆయన జీవితకాలానికి మించి మరణానంతరం కూడా ఓ వేడుకలా సాగుతుంది. కళలు చిరకాలం కొనసాగుతుంటాయి. సెల్యూట్ మాస్టర్” అంటూ పోస్ట్ చేశారు.

  • 03 Feb 2023 10:02 AM (IST)

    నేడు షూటింగ్స్ బంద్..

    దిగ్గజ దర్శకులు కె.విశ్వనాథ్ గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త విని తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ మృతికి సంతాపంగా ఈరోజు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు టాలీవుడ్ ప్రకటించింది. స్వచ్చందంగా షూటింగ్స్ క్లోజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

  • 03 Feb 2023 09:57 AM (IST)

    విశ్వనాథ్ మరణంపై కమల్ హాసన్ భావోద్వేగ పోస్ట్..

    ‘జీవిత పరమార్థం, కళలకు ఉండే అమరత్వం గురించి కె విశ్వనాథ్ గారు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే కళాతపస్వి సృష్టించిన కళ.. ఆయన జీవితకాలానికి మించి మరణానంతరం కూడా వేడుకలా సాగుతుంది. కళలకు చావు లేదు’ అని విశ్వనాథ్ గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ ట్వీట్ చేశారు కమల్.

  • 03 Feb 2023 09:39 AM (IST)

    కళాతపస్వి కడసారి చూపుల కోసం తరలివస్తోన్న సినీ ప్రముఖులు..

    తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన దర్శకులు కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకుని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కళాతపస్విని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‏లో ఆయన నివాసానికి వెంకటేశ్, మణిశర్మ, గుణశేఖర్, త్రివిక్రమ్, సాయి కుమార్ వంటి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

  • 03 Feb 2023 09:28 AM (IST)

    కె.విశ్వనాథ్ అంత్యక్రియలు..

    కె.విశ్వనాథ్ పార్థివ దేహానికి పంజాగుట్ట స్మశాన వాటికలో ఈరోజు మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

  • 03 Feb 2023 09:06 AM (IST)

    కె.విశ్వనాథ్ మరణం పట్ల సమాచార,సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంతాపం..

    కె.విశ్వనాథ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సమాచార,సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. దర్శక దిగ్గాజాన్ని కోల్పవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటని అన్నారు మంత్రి. విశ్వనాధ్ ఆత్మకు శాంతి చేకూరలని కోరారు.

  • 03 Feb 2023 08:42 AM (IST)

    కె. విశ్వనాథ్ పై చిరు భావోద్వేగ పోస్ట్..

    కళాతపస్వి విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజు అత్యంత విషాదకరమైన రోజు అని.. పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతి ని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ, ‘స్వయంకృషి, ‘ఆపద్బాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనదని అన్నారు చిరు.

  • 03 Feb 2023 08:36 AM (IST)

    కె. విశ్వనాథ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…

    కళాతపస్వి, దర్శకుడు శ్రీ కె విశ్వనాథ్ గారి మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భారతీయ సాంసృతి సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను తీసిన కళాతపస్వి విశ్వనాథ్ గారి మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని అన్నారు. సామాజిక అంశాలను జోడించి తీసిన సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచే ఉంటాయని వారి సేవల్ని కొనియాడారు. వారి కుటుంబానికి అభిమానులకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

  • 03 Feb 2023 08:32 AM (IST)

    తెలుగు చిత్రపరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.. బాలకృష్ణ.

    కళాతపస్వి కె విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ..ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటు అని అన్నారు నందమూరి బాలకృష్ణ. డైరెక్టర్ విశ్వనాథ్ మరణంపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. “విశ్వనాథ్ గారి ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం..అందుకే ఆయన కళాతపస్వి..మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటిచెప్పారు. ఆయన సినిమాలు సందేశాత్మకమే కాకుండా, అద్భుత సాంకేతిక విలువలతో మన కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని శిఖరాగ్రాన నిలబెట్టాయి, ప్రజాదరణ పొందాయి. కె విశ్వనాథ్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని అన్నారు.

  • 03 Feb 2023 08:30 AM (IST)

    ‘శంకరాభరణం’తో జాతీయ పురస్కారం

    విశ్వనాథ్ దర్శకత్వం వహించిన అద్భుతమైన సినిమాల్లో, భారతీయ చలనచిత్ర ఆణిముత్యాల్లో ‘శంకరాభరణం’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా నంది అవార్డు రావడమే కాక.. జాతీయ అవార్డు కూడా అభించింది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్’ విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది శంకరాభరణం. ‘

  • 03 Feb 2023 08:15 AM (IST)

    తొలి సినిమాతోనే ‘నంది’

    ‘ఆత్మ గౌరవం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విశ్వనాథ్.. ఆ మూవికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. సినిమా కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘చెల్లెలి కాపురం’, ‘శారదా’, ‘ఓ సీత కథ’,‘జీవన జ్యోతి’ చిత్రాలకు కూడా ఉత్తమ సినిమా విభాగంలో నంది అవార్డులు అందుకున్నాయి.

  • 03 Feb 2023 07:58 AM (IST)

    ఈరోజు ఉదయం 11 గంటలకు విశ్వనాద్ అంత్యక్రియలు..

    ఈ రోజు ఉదయం 11 గంటల తరువాత కె విశ్వనాధ్ అంత్యక్రియలు. పంజాగుట్టలో నిర్వహించే అవకాశం.

  • 03 Feb 2023 07:51 AM (IST)

    కళాతపస్వి సినీ ప్రస్థానం..

    కళాతపస్వి విశ్వానాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన ఆయన.. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ కంప్లీట్‌ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. 1965లో అక్కినేని నాగేశ్వరావు కథానాయకుడిగా నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా వచ్చిన కె.విశ్వనాథ్‌ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటారు విశ్వనాథ్.

  • 03 Feb 2023 07:33 AM (IST)

    విశ్వనాథ్ పార్థీవదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు..

    దర్శకుడు విశ్వనాధ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు తెనికేళ్ల భరణి, రాఘవేంద్ర రావు

Follow us on