
దర్శకుడు జయంత్ సి పరంజీ తన సినీ ప్రయాణం గురించి ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే తన జీవన రహస్యమని, ఏదీ తనను ఏమాత్రం డిస్టర్బ్ చేయదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఫ్లాప్ అయినా లేదా ఆర్థికంగా పెద్ద నష్టం ఎదురైనా తాను ఏమాత్రం కలత చెందనని, అది చిన్నప్పటి నుండి తన మానసిక స్థితి అని ఆయన తెలిపారు. తన దర్శకత్వంలో వచ్చిన టక్కరి దొంగ సినిమా కమర్షియల్‌గా పెద్ద ఫ్లాప్ అయిందని, అది తన జేబుకు పెద్ద రంధ్రం చేసిందని పరంజీ గుర్తు చేసుకున్నారు. ఈ నష్టం నుండి కోలుకోవడానికి తనకు దాదాపు నాలుగేళ్లు పట్టిందని, తాను సంపాదించిన ప్రతి పైసా అప్పులు తీర్చడానికే సరిపోయిందని ఆయన వివరించారు. అయితే, ఈ అనుభవం తనను ఏమాత్రం కుంగదీయలేదని, టక్కరి దొంగ ఫ్లాప్ అయిన వెంటనే ఈశ్వర్ షూటింగ్ కోసం వెళ్లిపోయానని, అశోక్ నిర్మాణంలో మరో సినిమాను కూడా ప్రారంభించానని తెలిపారు. జీవితంలో ఇవన్నీ భాగమని, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటామని ఆయన అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
కళ పట్ల తనకు చిన్నప్పటి నుంచే ప్రత్యేక అనుబంధం ఉందని జయంత్ సి పరంజీ తెలిపారు. బాల్యం నుంచే బొమ్మలు వేయడం, పెయింటింగ్‌లు చేయడం తనకు అలవాటని, తన తల్లి వద్ద ఇప్పటికీ తన వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్‌ల స్టాక్ ఉందని ఆయన పేర్కొన్నారు. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు హాజరయ్యేవాడినని, సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ లో తాను సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. కళలోని ప్రతి రూపాన్ని తాను అమితంగా ప్రేమిస్తానని ఆయన వెల్లడించారు. తన ఇంటిలో బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల పోస్టర్‌లు ఉన్నప్పటికీ, తెలుగు చిత్రాలకు సంబంధించిన పోస్టర్‌లు కనిపించకపోవడానికి కారణాన్ని కూడా జయంత్ సి పరంజీ వివరించారు. మాయాబజార్ , ముత్యాలముగ్గు వంటి తన రెండు అత్యంత అభిమాన తెలుగు చిత్రాల ఒరిజినల్ పోస్టర్‌ల కోసం తాను చాలా ప్రయత్నించానని, కానీ దొరకలేదని ఆయన చెప్పారు. మాయాబజార్, ముత్యాలముగ్గు చిత్రాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ముత్యాలముగ్గు చిత్రాన్ని థియేటర్లలో పదే పదే చూసేవాడినని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కె. విశ్వనాథ్ సినిమాలంటే తనకు అపారమైన గౌరవం ఉందని, లక్ష్మీ నరసింహా సినిమాలో విశ్వనాథ్ ని డైరెక్ట్ చేయడం తన కెరీర్‌లో ఒక పీక్ పాయింట్ అని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
శంకరాభరణం కన్నా సిరిసిరి మువ్వ, సీతామహాలక్ష్మి చిత్రాలలో తాను ఎక్కువ ఆత్మను కనుగొన్నానని విశ్వనాథ్ తో పంచుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శ్యామ్ బెనెగల్, బీమల్ రాయ్ వంటి వారి చిత్రాలతో పాటు మన్మోహన్ దేశాయ్ అమర్ అక్బర్ ఆంథోనీ వంటి కమర్షియల్ చిత్రాలను కూడా తాను చూసేవాడినని, బాపు అందాల రాముడు తన అభిమాన చిత్రాలలో ఒకటని జయంత్ సి పరంజీ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..