Harish Shankar: ఆమె నా భార్య కాదురా బాబు..! క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

|

Aug 17, 2024 | 9:09 AM

మిరపకాయ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రవితేజకు జోడీగా గ్లామరస్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్ నటించి మెప్పించింది. అలాగే మరో హీరోయిన్‌గా దీక్షా సేథ్ నటించింది. 2011న విడుదలైన మిరపకాయ్ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించారు

Harish Shankar: ఆమె నా భార్య కాదురా బాబు..! క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Harish Shankar
Follow us on

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మిరపకాయ్ సినిమా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మిరపకాయ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రవితేజకు జోడీగా గ్లామరస్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్ నటించి మెప్పించింది. అలాగే మరో హీరోయిన్‌గా దీక్షా సేథ్ నటించింది. 2011న విడుదలైన మిరపకాయ్ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ మూవీలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ క్రేజ్ పెరిగిపోయింది. అటు తమన్‌కు కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ వాయిస్‌తో కుర్రకారును ఆకట్టుకుంది ఆమె .ఆ చిన్నదాని పేరు పేరు స్నిగ్థ. ఈ అమ్మడు సినిమాలో కనిపించింది తక్కువ సేపే అయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. చూడటానికి చక్కగా ఉండే ఈ అమ్మడు వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే కాస్త బొంగురుగా ఉంటుంది. ఆ వాయిస్ తోనే కుర్రాళ్లను కట్టిపడేసింది స్నిగ్థ. అయితే స్నిగ్థ హరీష్ శంకర్ భార్య అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

అయితే ఈ వార్తల పై హరీష్ శంకర్ స్పందించారు. ఆ నటి తన భార్య కాదు అని క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. ” మిరపకాయ్ సినిమాలో నటించిన స్నిగ్ధ నా భార్య కాదు. సోషల్ మీడియాలో వస్తున్నవి రూమర్స్ మాత్రమే.. నా భార్య పేరు కూడా స్నిగ్ధ కావడంతో ఈ రోమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మిరపకాయ్ సినిమాలో నటించిన స్నిగ్ధ ప్రస్తుతం విదేశాల్లో ఉంది. నా సినిమాలో మళ్లీ నటిస్తావా అని అడిగితే రాను అని చెప్పింది. ఇలాంటి రూమర్స్‌ను నా భార్య పట్టించుకోదు” అని అన్నారు హరీష్ శంకర్. ఇక హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. రవితేజ తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. కానీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..