
తెలుగు సినీ పరిశ్రమలో అందమైన ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అంటే గుర్తొచ్చేది అతికొద్ది మంది దర్శకులే. అందులో డైరెక్టర్ హను రాఘవపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన భారీ విజయాన్ని సాధించాయి. తెలుగు సినీ ప్రపంచంలో హను సృష్టించిన ప్రేమకథలు ప్రత్యేకమనే చెప్పాలి. 2012లో అందాల రాక్షసి సినిమాతో దర్శకుడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమగాధ, అబద్ధం చిత్రాలను తెరకెక్కించారు. 2018లో శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను దర్శకత్వం వహించిన పడి పడి లేచె మనసు సినిమాకు మంచి రివ్యూ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక చాలా కాలం గ్యాప్ తీసుకున్న హను.. 2022లో సీతారామం సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో అటు డైరెక్టర్ హను రాఘవపూడి పేరు కూడా మారుమోగింది. ఈ మూవీలో ఆయన రాసిన డైలాగ్స్ గురించి చెప్పక్కర్లేదు.
“కురుక్షేత్రంలో రావణ సంహారం.. యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం” అంటూ సీత మాటలతో ప్రేక్షకులను ఆలోచనలో పడేశాడు. సీతామహాలక్ష్మి ప్రేమ కోసం కశ్మీర్‌ని మంచుకొదిలేసి వచ్చేసిన రామ్ తపనతో అడియన్స్ మనసులను కదిలించాడు. అందమైన ప్రేమకథతో జనాలను హృదయాలను తాకి.. కన్నీళ్లు తెప్పించాడు. అలాంటి అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడు ఓ హీరోయిన్‌కు పెద్ద అభిమాని. ఆమె అంటే గౌరవమని స్వయంగా హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అదే వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ హను రాఘవపూడి అభిమానించే హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఇంకెవరు.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.
హను రాఘవపూడి మాట్లాడుతూ.. “సాయి పల్లవి.. ఆ అమ్మాయి అంత ప్రొఫెషనల్ వేరొకరు ఉండరని కాదు.. కానీ తను వేరెలెవల్.. తన ఆలోచన విధానం గానీ.. ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవల్స్ గానీ.. ఆమె డీటెయిలింగ్ గానీ వేరెలెవల్. నేను ఆ అమ్మాయికి బిగ్ ఫ్యాన్. తనంటే చాలా గౌరవం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ చేస్తున్నారు సాయి పల్లవి ఫ్యాన్స్. హను రాఘవపూడి తెరకెక్కించిన పడి పడి లేచే మనసు సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.