Hanu Raghavapudi: ‘సీతారామం’లో రష్మిక పాత్రపై దర్శకుడు హనురాఘవాపుడి ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా వినిపిస్తోన్న పేరు రష్మిక. తక్కువ సమయంలోనే ఈ చిన్నది టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

Hanu Raghavapudi: సీతారామంలో రష్మిక పాత్రపై దర్శకుడు హనురాఘవాపుడి ఆసక్తికర కామెంట్స్
Hanu Raghavapudi

Updated on: Jul 23, 2022 | 5:32 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా వినిపిస్తోన్న పేరు రష్మిక(Rashmika Mandanna). తక్కువ సమయంలోనే ఈ చిన్నది టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా అమ్మడి రేంజును , క్రేజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ , కన్నడ బాషలతోపాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. ఇక తెలుగులో రష్మిక సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో కీలక పాత్రకు రష్మిక ఒప్పుకోవడం విశేషం. రష్మిక ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందంటే కథ ఎంత బలంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సీతారామం సినిమాలో అఫ్రిన్ అనే పాత్రలో నటిస్తోంది రష్మిక. తాజాగా ఓ ఇంట్రవ్యూలో దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. రష్మిక పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే అన్నారు దర్శకుడు హను. అలాగే టీజర్ లో చెప్పినట్లు రామ్ ఒక అనాధ. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు. రేడియోలో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుంతుంది. తను అనాధ అని తెలిసిన తర్వాత చాలా మంది అతనికి ఉత్తరాలు రాశారు. అలా వచ్చిన ఒక సర్ప్రైజ్ లెటర్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ లెటర్ లో ఏముందో ఇప్పటికి సస్పెన్స్. ఆ లెటర్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ జరుగబోతుందో అదే సీతారామం కథ అని అన్నారు హను రాఘవపూడి. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి