Gunasekhar : ఎన్టీఆర్‏తో సినిమా కోసం ఆరు నెలలు తిరిగా.. ఎందుకు చేయలేదంటే.. అసలు విషయం చెప్పిన గుణశేఖర్..

డైరెక్టర్ గుణశేఖర్ సినిమాలకు తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఒక్కడు, రుద్రమదేవి వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు యుఫోరియా సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే తన సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Gunasekhar : ఎన్టీఆర్‏తో సినిమా కోసం ఆరు నెలలు తిరిగా.. ఎందుకు చేయలేదంటే.. అసలు విషయం చెప్పిన గుణశేఖర్..
Gunasekhar, Jr.ntr

Updated on: Jan 30, 2026 | 7:33 PM

దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు యుఫోరియా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో బాండింగ్ పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాలని ఆరు నెలల పాటు కథా చర్చలు నడిపినట్లు, అయితే కథ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టును వదులుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం, తన ప్రతిష్టాత్మక చిత్రం రుద్రమదేవి నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను వివరించారు. ఒక మహిళా ప్రధాన చిత్రంగా కావడంతో నిర్మాతలు వెనుకాడినప్పటికీ, గుణశేఖర్ సొంతంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి కష్టపడ్డారని, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలతో తీవ్ర శారీరక శ్రమకు గురయ్యారని గుణశేఖర్ ప్రశంసించారు. అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ లేకుండా గోన గన్నారెడ్డి పాత్రకు మద్దతు ఇచ్చి చరిత్ర పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. దర్శకుడిగా తనకు నిద్ర తక్కువని, ప్రతి షాట్ పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తానని గుణశేఖర్ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

రుద్రమదేవి చిత్ర నిర్మాణ అనుభవాల గురించి మాట్లాడుతూ, ఒక్కడు సినిమా తర్వాత వెంటనే ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని భావించినట్లు తెలిపారు. టీమ్‌తో సహా వరంగల్‌కు వెళ్లి షూటింగ్ కోసం సన్నాహాలు కూడా చేశారన్నారు. అయితే, ఒక మహిళా ప్రధాన చిత్రం కావడంతో, బడ్జెట్ విషయంలో నిర్మాతలు వెనకాడటంతో ఆ సమయంలో ప్రాజెక్ట్ వాయిదా పడిందని పేర్కొన్నారు. రుద్రమదేవి కథ, చరిత్ర తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, అందుకే ఆ కథను సినిమాగా తెరకెక్కించడంలో దృఢంగా నిలబడ్డానని గుణశేఖర్ తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

రుద్రమదేవి చిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు పరిశ్రమలో “గుణశేఖర్ అయిపోయాడు”, “పిచ్చిబట్టి ఈ సినిమాని నెత్తికెత్తుకున్నాడు” వంటి వ్యాఖ్యలు వినిపించాయని, తన టీమ్‌లో కొందరు కూడా దీర్ఘకాల ప్రాజెక్ట్ కావడం వల్ల కమిట్‌మెంట్ల కారణంగా మధ్యలో వెళ్లిపోయారని ఆయన వివరించారు. అయితే, ఆ సవాళ్లను అధిగమించి, తన విజన్‌ను నమ్మి ముందుకు వెళ్ళానని తెలిపారు. సినిమా విడుదలయ్యాక “నో లాస్, నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్” సాధించడం తనకు పెద్ద విజయంగా అనిపించిందని, ఇది కథ, అనుష్క, అందరి శ్రమకు దక్కిన ఫలితమని గుణశేఖర్ స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..