
తమిళ్ సినీ పరిశ్రమలో కొద్ది రోజులుగా డైరెక్టర్ అమీర్, నిర్మాత జ్ఞానవేల్ మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కార్తీ నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్ సినిమా బడ్జెట్ గురించి తలెత్తిన ఈ వివాహం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. ఇప్పుడు వీరిద్దరి టాపిక్ కోలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్. కొన్నిరోజుల క్రితం పరుత్తివీరన్ సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ జ్ఞానవేల్ డైరెక్టర్ అమీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. పరుత్తివీరన్ సినిమా విషయంలో డైరెక్టర్ అమీర్ ఎక్కువగా ఖర్చు చేశాడని.. తన అవసరాలకు వాడుకున్నాడని.. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ చేశాడని.. కావాలనే ఇలా డబ్బును ఉపయోగించాడంటూ నిర్మాత జ్ఞానవేల్ ఆరోపించాడు. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకుడు అమీర్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే సినీ నిర్మాత శశికుమార్, నటుడు సముద్రఖని, సుధా కొంగర, నటుడు పొన్వన్నన్ తదితరులు అమీర్‌కు మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు దర్శకుడు భారతీ రాజా సైతం అమీర్‌కు సపోర్ట్ చేస్తూ ఓ నోట్ షేర్ చేశారు.
“జ్ఞానవేల్.. నేను మీరు మాట్లాడిన వీడియో చూశాను. పరుత్తివీరన్ సినిమాపై మీరు ఆర్థిక సమస్యలు ఉన్నాయి.. కానీ నువ్వు ఒక గొప్ప క్రియేటర్‌ను, అతడి పేరును, ప్రతిష్టను, కృషిని దిగజార్చేలా మాట్లాడటం ఖండించాల్సిన విషయం. ఈ సినిమా విషయంలో అమరీ పాత్ర చాలా పెద్దదని మర్చిపోవద్దు. పరుత్తివీరన్ కంటే ముందు డైరెక్టర్ అమీర్ రెండు సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ మీ సినిమాతోనే పని నేర్చుకున్నాడు.. సంపాదించాడు అని చెప్పడం నాలంటి క్రియేటర్లను అవమానించడమే. ఎందుకంటే నిజమైన క్రియేటర్స్ చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక గొప్ప క్రియేటర్, అతడి పనిని, చిత్తశుద్ధిని అవమానించినందుకు నువ్వు అతడికి క్షమాపణలు చెప్పాల్సిందే. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడం మంచిదని భావిస్తున్నాను” అంటూ ప్రకటన విడుదల చేశారు భారతీ రాజా.
మరోవైపు డైరెక్టర్ కుర.పళనియప్పన్ సైతం అమీర్ కు మద్దతుగా నిలిచారు. అలాగే సూర్య, కార్తీ తండ్రి శివకుమార్ మాట్లాడుతూ.. డైరెక్టర్ అమీర్ కు నిర్మాత జ్ఞానవేల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ సినిమా మధ్యలోనే నిర్మాత చేతులెత్తేస్తే అమీర్ తన సొంత డబ్బుతో సినిమా తీశాడని.. నటీనటులు కూడా కొంత డబ్బు సాయం చేశామని.. అంత కలిసి సినిమాను పూర్తి చేశామని.. చివరకు వచ్చి నిర్మాతగా నీ పేరు వేసుకున్నావంటూ జ్ఞానవేల్ పై నటుడు సముద్రఖని ఆగ్రహం వ్యక్తం చేశారు.
The Battalion of the first 100 soldiers, ready to march into the cinematic battlefield! 🔥
Join us at 7:19 PM on @HombaleFilms‘ YouTube channel. #Salaar Duty calls!#Prabhas #SalaarCeaseFire #HombaleVerse #SalaarFanArmy #SalaarMerchandise #SalaarStyle #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/wZQs95IMbI
— Hombale Films (@hombalefilms) November 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.