‘ఫిల్మ్‌నగర్’ ఏరియా పేరు మార్చాలంటోన్న డైరెక్టర్ బాబ్జి

| Edited By:

Nov 26, 2019 | 6:17 PM

హైదరాబాద్‌లోని ‘ఫిల్మ్ నగర్‌’ ఏరియా పేరు మార్చాలని డైరెక్టర్ బాబ్జి అభిప్రాయ పడ్డారు. ‘రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా.. ఫిల్మ్ నగర్‌‌కు మంచి పేరుందని.. హైదరాబాద్‌ను చూడటానికి వచ్చినవారందరూ.. ఈ ఏరియాను తప్పకుండా.. సందర్మించాలనుకుంటారన్నారు. కానీ.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌ పరిసరాలు వెలవెల బోతున్నాయని.. దీన్ని మరలా కళ కళలాడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. కాగా.. తెలుగు చిత్ర సీమకు వన్నె తెచ్చిన దాదాసాహెబ్ […]

ఫిల్మ్‌నగర్ ఏరియా పేరు మార్చాలంటోన్న డైరెక్టర్ బాబ్జి
Follow us on

హైదరాబాద్‌లోని ‘ఫిల్మ్ నగర్‌’ ఏరియా పేరు మార్చాలని డైరెక్టర్ బాబ్జి అభిప్రాయ పడ్డారు. ‘రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా.. ఫిల్మ్ నగర్‌‌కు మంచి పేరుందని.. హైదరాబాద్‌ను చూడటానికి వచ్చినవారందరూ.. ఈ ఏరియాను తప్పకుండా.. సందర్మించాలనుకుంటారన్నారు. కానీ.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌ పరిసరాలు వెలవెల బోతున్నాయని.. దీన్ని మరలా కళ కళలాడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.

కాగా.. తెలుగు చిత్ర సీమకు వన్నె తెచ్చిన దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత.. రఘుపతి వెంకయ్యనాయుడు పేరును.. ఫిల్మ్‌నగర్‌కు పెట్టాలని డైరెక్టర్ బాబ్జి తెలిపారు. అలాగే.. ఫిల్మ్‌నగర్‌లోని వీధులకు సినిమా రంగానికి అపారమైన సేవలను అందించిన గొప్పగొప్పవారి పేర్లను పెట్టాలని సూచించారు. ఈ ప్రాంతాలన్నీ మరలా కళకళలాడే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్మ్ నగర్‌కి ‘రఘుపతి వెంకయ్యనాయుడు ఫిల్మ్‌నగర్‌’గా పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు డైరెక్టర్ బాబ్జి.

రఘుపతి వెంకయ్యనాయుడు జీవితం ఆధారంగా.. ఓ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ బాబ్జి. ఈ బయోపిక్‌లో సీనియర్ నటుడు నరేష్ టైటిల్ రోల్‌లో నటించాడు. కాగా.. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.