సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మహేష్. అంతే కాదు అల్ టైం రికార్డ్ కూడా క్రియేట్ చేశారు మహేష్ బాబు . అయితే గుంటూరు కారం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది “నేను నా ఫ్యాన్స్ కు తప్ప ఆటోగ్రాఫ్ ఎవ్వరికి ఇవ్వనూ” అని అంటారు మహేష్. అయితే మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..?
మహేష్ బాబుకు అభిమానులంటే ఎంతో ప్రేమ. ప్రేక్షకులు ఆయనను ఎంతగా అభిమానిస్తారో మహేష్ కూడా తన అభిమానులను అంతగా ప్రేమిస్తాడు. ప్రతి సారి తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో అభిమానుల గురించి చెప్పి వారిపై తన ప్రేమ ఎంతవుందో తెలుపుతారు. మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు అంటూ మహేష్ చెప్పే మాటలు ఆయన అభిమానులను ఫిదా చేస్తుంది.
తాజాగా మహేష్ బాబు ఆటోగ్రాఫ్ వైరల్ అవుతుంది. లవ్ మహేష్ బాబు అంటూ సూపర్ స్టార్ సిగ్నేచర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ అభిమానికి మహేష్ బాబు ఇచ్చిన ఆటోగ్రాఫ్ ఇది. ఇప్పుడు మహేష్ ఆటోగ్రాఫ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా కేవలం వారం రోజులకే 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహేష్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
It’s a massy Sankranthi!! 🔥#GunturKaaram… In theatres Jan 12th, 2024!!https://t.co/2dIdpaQEn9#Trivikram @MusicThaman @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine #GunturKaaramOnJan12th pic.twitter.com/iQHclSqbS0
— Mahesh Babu (@urstrulyMahesh) January 7, 2024
The vibe of Ramana! Here’s #RamanaAei!🔥https://t.co/7ciPQjM9Ad@MusicThaman #Trivikram @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @Yugandhart_ @haarikahassine @adityamusic
— Mahesh Babu (@urstrulyMahesh) January 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి