Ahuti Prasad: ఆహుతి ప్రసాద్ గుర్తున్నారా? ఇప్పుడు ఆయన కుమారుడు కూడా తెలుగులో ఫేమస్ నటుడు.. ఎవరో తెలుసా?

సహాయక నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా ఎన్నో వందల తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు ఆహుతి ప్రసాద్. నటుడిగా ఆయన అందరికీ పరిచయమే. కానీ ఆయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఆహుతి ప్రసాద్ కుమారుడు కూడా తెలుగులో ఫేమస్ నటుడు.

Ahuti Prasad: ఆహుతి ప్రసాద్ గుర్తున్నారా? ఇప్పుడు ఆయన కుమారుడు కూడా తెలుగులో ఫేమస్ నటుడు.. ఎవరో తెలుసా?
Ahuti Prasad

Updated on: Oct 26, 2026 | 9:01 PM

సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరు. సహాయక నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా ఎన్నో వందల తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారాయన. కృష్ణ జిల్లాలో పుట్టి పెరిగిన ఆహుతి ప్రసాద్ కోనసీమ యాసలో డైలాగులు చెప్పడంలో ప్రత్యేకమైన శైలి ఉంది. 1986లో అక్కినేని నాగార్జున నటించిన మొదటి చిత్రం విక్రమ్ తోనే తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యారు ప్రసాద్. ఈ సినిమా విజయం సాధించినా ప్రసాద్ కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆ మరుసటి ఏడాదే రాజశేఖర్ హీరోగా డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఆహుతి చిత్రం సినిమా ఈ నటుడి జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో అతను పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. అంతే.. తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఆహుతి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని ఆహుతి ప్రసాద్ గా మారిపోయాకె. దీని తర్వాత ఆయన వెనుదిరిగా చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. టూ టౌన్ రౌడీ, ముద్దుల మావయ్య, బాలచంద్రుడు, అసెంబ్లీ రౌడీ, ఘరానా మొగుడు, నిన్నే పెళ్లాడతా, చూడాలని ఉంది, గణేష్, స్వయం వరం, సమర సింహారెడ్డి, సీతయ్య, సూర్య వంశం, కలిసుందాంరా, ఇంద్ర, చందమామ, లెజెండ్, అరుంధతి, చందమామా.. ఇలా తెలుగులో దాదాపు 150కు పైగా చిత్రాల్లో నటించారు ఆహుతి ప్రసాద్. కేవలం నటునిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యారీ సీనియర్ నటుడు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా అందుకున్నారు.

కాగా నటునిగా బిజీగా ఉంటోన్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు ఆహుతి ప్రసాద్. చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన చివరికి 2015 జనవరి 4న తుది శ్వాస విడిచారు. సినిమాల పరంగా ఆహుతి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. ఆహుతి ప్రసాద్ కు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకుల పేర్లు కార్తీక్ ప్రసాద్, భరణి ప్రసాద్. భరణి ప్రసాద్ వివాహం అప్పట్లో చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ సెలబ్రిటీలు ఈ వెడ్డింగ్ కు హాజరయ్యారు. ఇక ఆహుతి ప్రసాద్ రెండు కుమారుడు కార్తీక్ ప్రసాద్ తెలుగులో మంచి నటుడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం అనే సినిమాలో కార్తీక్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా ఈవెంట్లో కార్తీక్ ఇచ్చిన స్పీచ్ కూడా అప్పట్లో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పాటు పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమాలో కూడా చేశాడు కార్తీక్. ఇవే కాకుండా.. రెండు, మూడు చిన్న సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అయితే పెద్దగా క్రేజ్ రాలేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు కార్తీక్.

ఇవి కూడా చదవండి

Ahuti Prasad Son

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us