
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు రాజమౌళి. అలాగే ఈ ఈవెంట్ లోనే మహేష్ బాబు లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశారు. వారణాసి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. అంతే కాదు మహేష్ బాబు ఈ సినిమాలో రాముడిగాను కనిపించనున్నాడు.
ఇటీవలే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా కొన్ని స్టిల్స్ ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు సంబందించిన ఓల్డ్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పై ఫొటోలో మహేష్ బాబు పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె మరెవరో కాదు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తోంది. ముఖ్యంగా పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో కామాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడామె వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అలా తాజాగా కామాక్షి ప్రధాన పాత్రలో నటించిన సినిమా అగధ. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబుతో దిగిన ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి