
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన పీరియాడికల్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఏసుబాయి పాత్రలో మరో కీలక పాత్ర పోషించింది. అలాగే ఔరంగ జేబుగా అక్షయ్‌ఖన్నా క్రూరత్వం పండించాడు. వీరితో పాటు డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా వరుసగా అపజయాలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఛావా కొత్త ఊపిరి పోసింది. ఇక సినిమాలో విక్కీ నటన అద్భుతమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈ స్టార్ హీరో యాక్టింగ్ అందరినీ కదిలిస్తుంది. అలాగే అక్షయ్ ఖన్నా విక్కీని హింసించిన తీరు అందరితో కన్నీళ్లు పెట్టిస్తుంది. అందుకే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఆడియెన్స్ కన్నీళ్లతో బయటకు వచ్చారు. అంతలా ఛావా మూవీ ఆడియన్స్ ను కదిలించింది. కేవలం హిందీలోనే కాదు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక ఓటీటీలోనూ ఛావా మూవీ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది.
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఛావా సినిమాను మలయాళ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ అద్భుతంగా తెరకెక్కించారు.మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించగా, . ఆస్కార్ విజేత రెహమాన్ ఈ సినిమాకు స్వరాలందించాడు. కాగా ఛావా సినిమా హీరోగా ఫస్ట్ ఛాయిస్ విక్కీ కౌశల్ కాదట. ఈ సినిమా కథ పట్టుకుని లక్ష్మణ్ ఉటేకర్ మొదట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని సంప్రదించారట. అయితే కారణమేంటో తెలియదు కానీ ఈ చిత్రంలో నటించేందుకు మహేష్ పెద్దగా ఆసక్తి చూపించలేదట. లేటుగా నైనా మహేష్ ఓకే చెబుతాడని ఈ స్టోరీను చాలా రోజులపాటు పెండింగ్‌లో పెట్టిరట లక్ష్మణ్. ఆ తర్వాతే హీరోగా విక్కీ కౌశల్‌ను అప్రోచ్ అయ్యారట. ఇక కథ వినగానే విక్కీ వెంటనే ఓకే చెప్పాడట. అలా మొత్తానికి ఛావా మూవీలో హీరోగా విక్కీ కౌశల్ ఫిక్స్ అయ్యారట. అలాగే ఈ హిస్టారికల్ మూవీలో మొదటగా హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కత్రిన కైఫ్ ను అనుకున్నారట. కానీ ఆమె కూడా నో చెప్పడంతో రష్మికను ఓకే చేసినట్లు సమాచారం.
అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ మహేష్ ఛావా సినిమాను చేసి ఉంటే నెక్ట్స్ లెవెల్ లో ఉండదని, పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకునే వాడని? అని కొందరు అంటున్నారు. అదే సమయంలో తనకు ఇలాంటి కథలు పెద్దగా సూట్ కావని ముందే మహేష్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదని మరికొందరు అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.