
రవితేజ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ సినిమాలు ఉండొచ్చు. కానీ విక్రమార్కుడు సినిమా మాత్రం మాస్ మహారాజా కెరీర్ లోనే చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా తోనే ఆయన స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. సాధారణంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను గమనిస్తే.. హీరోల స్టార్ డమ్ కంటే.. కంటే జక్కన్న డైరెక్షన్, మేకింగ్ తదితర విషయాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ విక్రమార్కుడు సినిమాలో మాత్రం జక్కన్న డైరెక్షన్ నే డామినేట్ చేశాడంటారు సినిమా నిపుణులు. అంతలా ఈ సినిమాలో ఒదిగిపోయారు రవితేజ. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో నటించాడు. అత్తిలి సత్తిబాబుగా ఒక పాత్రలో కామెడీ పండిస్తే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో తనదైన రౌద్రాన్ని చూపించారు మాస్ మహారాజా. సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టరే హైలెట్ అని చెప్పవచ్చు.
కాగా ఈ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమా గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. అదేంటంటే.. ఈ సినిమాలో రవితేజకు డూప్ గా ఆయన తమ్ముడు నటుడు భరత్ నటించడం విశేషం. నిజం చెప్పాలటే.. భరత్ నటించడం వల్లనే విక్రమార్కుడు సినిమా షూటింగ్ చాలా ఈజీగా అయిపోయిందట. కాగా తెలుగులో పలు సినిమాల్లో సహాయక నటుడిగా, విలన్ గా మెప్పించాడు భరత్ రాజ్. అతడే ఒక సైన్యం, ఒక్కడే, డేంజర్, వీరభద్ర, ఢీ, మంగతాయారు టిఫిన్ సెంటర్, రెడీ, ఏక్ నిరంజన్, కళావర్ కింగ్, రామ రామ కృష్ణ కృష్ణ, బావ, దూకుడు, బాడీ గార్డ్, రామయ్యా వస్తావయ్యా, జంప్ జిలానీ, దోచేయ్, షేర్, ఆ ముగ్గురు, మిస్టర్ ఇలా ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రలతో ఆకట్టుకున్నాడు భరత్. అయితే సినిమాలతో ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకున్నాడు భరత్. ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో భరత్ పేరు తరచుగా వినిపించింది.
ఇదే క్రమంలో సినిమా కెరీర్ బిజీగా ఉండగానే ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు భరత్. 2017 జూన్ 24న రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ మండలం కోత్వాల్ గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు.
Ravi Teja Brother Bharath
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి