
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ‘హనుమాన్’ సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్. సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా తెరకెక్కించారని కామెంట్స్ చేస్తున్నారు. సినీ రాజకీయ విశ్లేషకులు హనుమాన్ సినిమాపై.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మను తెగ పొగడిస్తున్నారు. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా అంతగా విజయం సాధించకపోయినా.. కథలో కొత్తదనం ఉందన్నారు. ఆ తర్వాత కల్కి, జాంబీరెడ్డి చిత్రాలతో విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో క్లిక్ అయ్యాడు. ఇప్పటికీ హనుమాన్ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఓవైపు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తుండగా.. మరోవైపు ఈ మూవీ సీక్వెల్ స్టా్ర్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఈ మూవీ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్ లో టాలీవుడ్ స్టార్స్ ఉంటారని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ.
ఇప్పటివరకు రచయితగా.. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మంచి క్రికెటర్ కూడా. అవును.. తన ఇన్ స్టాలో బ్యాక్ టూ ప్రాక్టీస్ అంటూ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. మల్టీ టాలెంటెడ్.. ప్రశాంత్ వర్మలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. రైటర్, డైరెక్టర్, క్రికెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నిజానికి ప్రశాంత్.. స్కూల్, కాలేజీ లెవల్స్ నుంచి క్రికెట్ ఆడుతూ వచ్చాడు. జిల్లా స్థాయిలో పలు కప్పులు గెలుచుకున్నాడు. పలు ప్రైవేట్ టోర్నమెంట్స్ లో ఆడి సక్సెస్ అయ్యాడు. బ్యాట్స్ మెన్, బౌలర్ కూడా. పలు టోర్నమెంట్లలో అత్యధిక రన్స్ సాధించి బెస్ట్ బ్యాట్స్ మెన్, బౌలింగ్ లో సత్తా చూపించి అవార్డులు అందుకున్నాడు. గతంలో సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో ఆడాడు. గతంలో తన క్రికెట్ విజయాలు, ప్రాక్టీస్ వీడియోస్ షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ.
ఇన్నాళ్లు హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు తిరిగి క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇప్పుడు అదే వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ప్రశాంత్ వర్మ హైదరాబాదా SRH టీంకు అనేక యాడ్స్ డైరెక్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. త్వరలోనే హనుమాన్ సీక్వెల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించి కీలకవిషయాలను అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.