
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చే ఫౌజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని రోజుల్లో సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోయే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. ఇదంతా పక్కన పెడితే.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్, సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డార్లింగ్ సినిమాల నుంచి వచ్చిన లేటేస్ట్ అప్డేట్స్ అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం విష్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
అదెంటంటే.. మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ చేయాలనుకున్నారట దివంగత నటుడు కృష్ణరాజు. ఆ సమయంలో డైరెక్టర్ మురగదాస్ వీరిద్దరి కోసం సెపరేట్ స్టోరీ రెడీ చేశారట. అయితే అప్పటికే ఇద్దరు వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట. ఇద్దరికి వరుస సినిమా అవకాశాలు రావడంతో నెమ్మదిగా ఈ మల్టీస్టారర్ స్టోరీ ఆగిపోయిందని టాక్. ఒకవేళ ఆ మల్టీస్టారర్ ఇప్పుడు వచ్చి ఉండుండే ఈరోజుల్లో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యేదని అంటున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ఇదిలా ఉంటే .. ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..