పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేశారు. బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్.. ఆ తర్వాత వరుసగా భారీ విజయాలను అందుకున్నాడు. కానీ పవన్ వదలుకున్న సినిమాలు కూడా అదే రేంజ్లో హిట్టయ్యాయని మీకు తెలుసా. పవన్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించారు. కాజల్, సమంత, శ్రుతి హాసన్, తమన్నా, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో నటించారు. అలాగే రాశీ, దేవయాని, రేణు దేశాయ్, భూమిక, ఆసిన్ వంటి సీనియర్ హీరోయిన్లతోనూ జత కట్టారు. కానీ పవన్ సౌందర్య కాంబోలో ఓ హిట్ మూవీ మిస్ అయ్యిందట. మీరు విన్నది నిజమే. వీరిద్దరి కాంబోలో ఓ మూవీ స్టోరీ కూడా సిద్ధం చేసుకున్నారట.
అదే సుస్వాగతం మూవీ. అవును.. ఈచిత్రానికి కథానాయికగా ముందుగా సౌందర్యను అనుకున్నారట. డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రంలో పవన్ జోడిగా సౌందర్యను తీసుకోవాలనుకున్నారట. కానీ అందుకు పవన్ నో చెప్పారట. సౌందర్య అంటే తనకు ఎంతో గౌరవం ఉందని.. ఆమె ముందు నటించలేనని అన్నారట. దీంతో ఆమె స్థానంలోకి దేవయానిని తీసుకొచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే మ్యూజికల్ హిట్ కూడా అయ్యింది.
సుస్వాగతం సినిమా టైంకే సౌందర్య స్టార్ హీరోయిన్. ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీలో విజయాలను అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు పవన్. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి చిత్రాలతో బాక్సాఫీస్ ను శాసించాడు. అలాంటి సమయంలోనే పవన్, సౌందర్య కాంబోలో ఆ సినిమా పడితే ఎలా ఉండేదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే వేరేలెవల్లో ఉండేదని అంటున్నారు.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్ను చూశారా..?
Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..
Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.