Soundarya: సౌందర్య నటించిన ఆఖరి సూపర్ హిట్ సినిమా ఇదే..పాపం ఈ మూవీ హీరో కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారు

ప్రముఖ హీరోయిన్ సౌందర్య చనిపోయి చాలా ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఎక్కడో ఒక చోట ఈ అందాల తార పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా టీవీల్లో సౌందర్య సినిమాలు వస్తుంటే 'అరె.. ఎంత ఘోరం జరిగిపోయిందిరా' అనే వాళ్లు చాలా మంది ఉన్నారు.

Soundarya: సౌందర్య నటించిన ఆఖరి సూపర్ హిట్ సినిమా ఇదే..పాపం ఈ మూవీ హీరో కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారు
Actress Soundarya

Updated on: Aug 20, 2026 | 9:22 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి సౌందర్య అని చెప్పవచ్చు. తన సహజ సిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో తెలుగులోనే కాదు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జగపతిబాబు, మోహన్ బాబు, రజనీకాంత్, శ్రీకాంత్.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు సౌందర్య. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో కలిపి వందకు పైగా సినిమాలు చేశారామె. చాలా ఏళ్ల పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా చెలామణి అయిన సౌందర్య ఎవరూ ఊహించని పరిస్థితుల్లో ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. హీరోయిన్ గా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే హఠాన్మరణం చెందింది. 2004లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూసింది. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీనే తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సౌందర్య చనిపోయి దాదాపు 22 ఏళ్లు గడిచిపోయాయి. అయినా ఎక్కడో ఒక చోట ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా టీవీల్లో సౌందర్య సినిమాలు వస్తుంటే ‘అరె.. ఎంత ఘోరం జరిగిపోయిందిరా’ అనే వాళ్లు చాలా మంది ఉన్నారు.

ఇదిలా ఉంటే చనిపోయే ముందు సౌందర్య నటించిన చివరి చిత్రం శివ శంకర్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో హీరోగా నటించారు. అయితే సౌందర్యకు ఆఖరి ఘన విజయాన్ని అందించిన సినిమా మాత్రం సీతయ్య అని చెప్పవచ్చు. వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించారు. సౌందర్య, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ 2003 లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసింది.

ఇక యాదృచ్చికమో లేక అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ హీరో హరికృష్ణ కూడా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2018 డిసెంబర్ 07న నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో హరికృష్ణకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇలా ఒకే సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వేర్వేరు ప్రమాదాల్లో కన్నుమూయడం నిజంగానే ఆశ్చర్యకరమని చెప్పవచ్చు. ఇక తెలుగు సినిమాల్లో ఈ నటీనటులు లేని లోటును పూడ్చలేరని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

సీతయ్య సినిమాలో సౌందర్య, హరికృష్ణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us