అప్పుడు సినిమాలు లేక పిచ్చెక్కిపోయింది.. ఆ పెద్ద హీరోలను ఛాన్స్ ఇవ్వమని అడిగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న కోట శ్రీనివాసరావు.. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్టార్ హీరోల పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అప్పుడు సినిమాలు లేక పిచ్చెక్కిపోయింది.. ఆ పెద్ద హీరోలను ఛాన్స్ ఇవ్వమని అడిగా..
Kota Srinivasa Rao

Updated on: Jul 15, 2026 | 12:13 PM

ప్రముఖ దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి అగ్రతారలతో తన అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మొదటి నుంచి నాకో బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, లేకపోతే గుడ్ హ్యాబిట్ అనుకోండి… నేను ఎవరిని వెళ్లి బాబు నాకు ఒక వేషం ఇప్పించు అని అడగలేదు,” అని కోట గారు అన్నారు. కానీ కరోనా సమయంలో పని లేకుండా ఇంట్లో కూర్చోవడం ఎంతో బోర్ కొట్టిందని, రోజుకు 100-150 మంది మధ్య 38 ఏళ్లు బతికిన తనకు, ఇప్పుడు ఒక్కసారిగా ఒంటరితనం పిచ్చెక్కిపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి. వినాయక్ వంటి పెద్ద దర్శకులను, హీరోలను సరదాగా “కాస్త వేషం ఏమైనా ఉందా?” అని అడిగేవాడిని అని చెప్పారు.

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

అయితే, ఈ మధ్యకాలంలో తనని కలచివేసిన ఓ సంఘటనను పంచుకున్నారు. ఒక బంధువు అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆయన్ను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో, కొందరు మీడియా ప్రతినిధులు తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రసారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. “కోట గారు అపోలో హాస్పిటల్ కి వెళ్లిపోయాడు, అయిపోయాడు,” అంటూ “సంతాపం పెట్టాడు అడ్వర్టైజ్మెంట్” అని కూడా రాశారని మండిపడ్డారు. తనకి 70 ఏళ్లు దాటాయని, కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు రావడం సహజమేనని, “మీ నాన్నకి రావా, నీకు రావా?” అని ప్రశ్నిస్తూ, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి వారికి ఏ హక్కు ఉందని నిలదీశారు.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

కొందరు తన వయసు, తన స్వభావాన్ని బట్టి తనతో పనిచేయడానికి సంశయించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తన నిజాయితీ, స్వాభిమానం గురించి మాట్లాడుతూ, “ఈరోజు తన వాకిట్లోకొచ్చి ఎవడైనా కోట గారు మీ రూపాయి బాకీ ఉన్నాడు అని అడిగేవాళ్ళు లేరు. చాలు ఈ జీవితానికి ఏం కావాలి,” అని సంతృప్తి వ్యక్తం చేశారు. తాను బ్యాంక్‌లో పుట్టి, సామాన్యుడిగా వచ్చి నటుడిగా ఎదిగి, పద్మశ్రీ దాకా చేరుకున్నానని, దీనికి భగవంతునితో పాటు కళామతల్లి ఆశీర్వాదం కూడా ఉందని అన్నారు. తన అత్యధిక రెమ్యూనరేషన్ లక్షా యాభై వేలని వెల్లడించిన కోట గారు, సంపాదించిన దాంట్లో తాను తృప్తిగా ఉన్నానని, తనకు ఎంత సంపద ఉందో తనకు తెలుసని, అంబానీ, టాటా, బిర్లా వంటి వారి సంపద వారికి కూడా తెలియదని చమత్కరించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us