ఒక హీరో దగ్గరకు వచ్చిన కథలతో వేరొక హీరోలు సినిమాలు తీయడం టాలీవుడ్‌లో సర్వసాధారణం. అందులో కొన్ని బ్లాక్స్‌బస్టర్ హిట్స్‌గా నిలిస్తే.. మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డవి కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 28న అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. దీనికి కూడా ఫస్ట్ ఛాయిస్ అఖిల్ కాదట. అక్కినేని అఖిల్ కంటే ముందుగా ఈ సినిమా కథ ఓ టాలీవుడ్ స్టార్ హీరో దగ్గరకు వెళ్లిందట. ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా.!
ఆ హీరో మరెవరో కాదు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. మొదటిగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రం కథను రామ్ చరణ్ దగ్గరకు తీసుకెళ్లారట. అయితే ఇతర కమిట్మెంట్స్ కారణంగా చరణ్ ఈ మూవీని సున్నితంగా తిరస్కరించాడట. ఈ విషయాన్ని అప్పట్లో రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం అఖిల్‌కి ఈ కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించాడు. కానీ విడుదలైన మొదటి ఆటకే ఈ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో డినో మోరియా, మమ్మూట్టీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి కథ వక్కంతం వంశీ అందించగా.. బాణీలను హిప్ హాప్ టమిజా స్వరపరిచాడు.