Prabhas: తగ్గేదే లే అంటున్న డార్లింగ్.. ఆ దర్శకుడికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.?

|

Aug 24, 2022 | 6:54 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన  లైనప్ చేసిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే.. దాంతో ఆయన సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas: తగ్గేదే లే అంటున్న డార్లింగ్.. ఆ దర్శకుడికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.?
Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన  లైనప్ చేసిన సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే.. దాంతో ఆయన సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ ఒకటి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కేజీఎఫ్ 1,2లతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రశాంత్.. ప్రభాస్ కోసం ఓ భారీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై ఓ రేంజ్ ఎక్స్పెటెషన్స్ ను క్రియేట్ చేశాయి. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్.

ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిపాత్రలో కనిపించనున్నాడట మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. అలాగే ఈ సినిమాలో రావణ్ గా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇక సీత పాత్రలో కృతిసనన్ కనిపించనుంది. అలాగే భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ తో కలిసి ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. వీటితోపాటు  మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తునండని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ ఇప్పుడు ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తోంది. అదికూడా ఓ బాలీవుడ్ దర్శకుడికి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడట డార్లింగ్. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీని వచ్చే ఏడాది జూన్ వరకు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి