Dhanush’s Sir : ‘సార్’ వచ్చేశారు.. ప్రీ లుక్‌తో ఆకట్టుకున్న స్టార్ హీరో ధనుష్..

|

Jan 07, 2022 | 3:18 PM

కోలివుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. తెలుగు దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇక్కడ కూడా తమ మర్మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు.

Dhanushs Sir : సార్ వచ్చేశారు.. ప్రీ లుక్‌తో ఆకట్టుకున్న స్టార్ హీరో ధనుష్..
Sir
Follow us on

Dhanush’s Sir : కోలివుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్‌కు క్యూ కడుతున్నారు. తెలుగు దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇక్కడ కూడా తమ మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే దళపతి విజయ్ వంశీ పైడిపల్లి తో.. శివ కార్తికేయ అనుదీప్‌తో.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో ఏకంగా ఇద్దరు దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో శేఖర్ కమ్ముల సినిమా ఒకటి.. మరొకటి వెంకీ అట్లూరి సినిమా. ఈ రెండు సినిమాల్లో ముందుగా వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు ధనుష్. రీసెంట్ గా రంగ్ దే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ.. ఇప్పుడు ధనుష్ కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేసి రంగంలోకి దిగుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజకార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి ధనుష్ పీలుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ధనుష్ మొఖం కనిపించకుండా వెనక్కి తిరిగి ఉన్న ఫోటోను విడుదల చేశారు. ఈ లుక్ లో ధనుష్ ఫార్మల్స్ ధరించి సింపుల్ గా కనిపిస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ను కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక వెంకీ తన సినిమాల్లో అందమైన ప్రేమ కథను కూడా చూపిస్తుంటాడు.. దాంతో ధనుష్ సార్ సినిమాలోనూ ఒక ఎమోషన్ తో కూడిన లవ్ స్టోరిని చూపిస్తాడని అంటున్నారు. ద్వి భాష సినిమా కావడంతో కొంతమంది నటులు తెలుగు లో తమిళ్ లో వేరు వేరుగా కనిపిస్తారని తెలుస్తుంది. దాంతో షూటింగ్ డబుల్ చేయాల్సి ఉంటుంది. దాంతో షూటింగ్ ను స్పీడ్ గా కానిచ్చేసి ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Danush

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Hyderabad: సినీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మల్టిప్లెక్స్ థియేటర్లలో తగ్గిన సినిమా టికెట్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..