
తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ధనుష్. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లక్రితం ధనుష్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. ఇటీవలే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాతో హిట్ అందుకున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అంతకు ముందు సార్ సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు ధనుష్.
మొన్నామధ్య ధనుష్ భార్య నుంచి విడిపోయిన విషయం తెలిసిందే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ధనుష్, ఐశ్వర్య విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కాగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ధనుష్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరోయిన్ ను ధనుష్ పెళ్లాడనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.
ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మొన్నీమధ్య మృణాల్ బర్త్ డే పార్టీలో ధనుష్ కనిపించాడు. దాంతో ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ధనుష్ సిస్టర్స్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది మృణాల్. దాంతో డేటింగ్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్లి డేట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వచ్చేనెల 14న మృణాల్, ధనుశ్ ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీని పై ధనుష్, మృణాల్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి దీనిపై ధనుష్, మృణాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..