David Warner: ఈసారి చిరు వంతు.. ‘ఆచార్యగా మారిన డేవిడ్‌ వార్నర్‌’… వైరల్‌ అవుతోన్న వీడియో…

David Warner Become Acharya: ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు చెందిన ఓ ప్లేయర్‌ ఇండియన్‌ హీరోలను అందులోనూ తెలుగు హీరోలను ఫాలో అవుతుండడం నిజంగానే ఆసక్తికలిగించే అంశం. ఇలా తన టిక్‌టాక్‌ వీడియోలతో ప్రేక్షకులను...

David Warner: ఈసారి చిరు వంతు.. ఆచార్యగా మారిన డేవిడ్‌ వార్నర్‌... వైరల్‌ అవుతోన్న వీడియో...
David-Warner

Updated on: Jan 31, 2021 | 7:07 PM

David Warner Become Acharya: ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు చెందిన ఓ ప్లేయర్‌ ఇండియన్‌ హీరోలను అందులోనూ తెలుగు హీరోలను ఫాలో అవుతుండడం నిజంగానే ఆసక్తికలిగించే అంశం. ఇలా తన టిక్‌టాక్‌ వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్? లాక్‌డౌన్‌ సమయంలో రకరకాల వీడియోలతో నెట్టింట్లో వైరల్‌గా మారాడు వార్నర్.
బాలీవుడ్‌ బడా హీరోల నుంచి మొదలు పెడితే.. టాలీవుడ్‌ వరకు హీరోల మొహాల స్థానంలో తన ఫేస్‌ను సెట్‌ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తున్నాడు. రీఫేస్‌ యాప్‌ సహాయంతో అమితాబ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, రజినీకాంత్‌ వంటి హీరోల సన్నివేశాలకు తన మొహాన్ని యాడ్ చేసి పోస్ట్‌ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ స్టార్‌ క్రికెటర్‌ టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవిగా మారిపోయాడు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ టీజర్‌ను రీఫేస్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక చిరు 152వ చిత్రంగా రానున్న ఆచార్య సినిమా.. మే13న విడుదలకానున్న విషయం తెలిసిందే. మరి ఆచార్యగా మారిన వార్నర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో..

Also Read:
OTT Platform: ఓటీటీకి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..

Rashi Khanna: రాశీఖన్నా మోటివేషనల్‌ స్పీచ్‌.. చాలా పెద్ద మాటలే చెప్పేసింది.. మీరే చూడండి