అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు కష్టపడి ఎదిగారు. వరుసగా సినిమాలు చేస్తూ తామంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో ఈ హీరో ఒకడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే కాదు హాలీవుడ్ లోనూ నటించి మెప్పించాడు. ఇండస్ట్రీకి వచ్చి 25ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ హీరో..

అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో
Tollywood Hero

Updated on: Mar 04, 2026 | 7:28 PM

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తోప్ హీరో.. 25ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ఎంతో ఒదిగి ఉంటాడు ఆ హీరో.. పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేశాడు.. అలాగే యంగ్ దర్శకులతోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. కథ నచ్చితే చాలు దర్శకుల గురించి  భాషల గురించి అస్సలు పట్టించుకోడు ఆ హీరో.. తెలుగు, తమిళ్ , హిందీతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు ఆ హీరో.. తొలి సినిమా సమయంలో బూటు కాలుతో తన్నులు తిన్న అతను ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో.. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు.

750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..

తమిళ హీరో ధనుష్.. ఈ స్టార్ హీరో క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లక్రితం ధనుష్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధనుష్. ఇటీవలే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాతో హిట్ అందుకున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అంతకు ముందు సార్ సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

రీసెంట్ గా ధనుష్  చెన్నైలోని ప్రముఖ విద్యా సంస్థ వేల్స్ యూనివర్సిటీ కల్చరల్ ఫెస్ట్‌ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఫెస్ట్ లో ధనుష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో 25 ఏళ్లుగా ఉన్నాను.. 25 ఇళ్ళు అంటే మాములు విషయం కాదు .. ఇప్పటి నుంచి నేను రెండో అధ్యాయాన్ని ప్రారంభించాను అని తెలిపాడు ధనుష్. అదేవిధంగా  వేల్స్ వర్సి టీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపాడు. తన మొదటి చిత్రం ‘తుళ్కువదో ఇలమై’ ఇక్కడే షూటింగ్ జరిగిందని తెలిపాడు ధనుష్. అంతేకాదు ఆ సినిమాలో ఒక సన్నివేశంలో వేల్స్ వర్శిటీ అధినేత, సినీ నిర్మాత డాక్టర్ ఐసర్ కె గణేష్ చేత బూటుకాలుతో తన్నులు కూడా తిన్నాను అని గుర్తు చేసుకున్నాడు. స్కూల్ , కాలేజీ రోజులే ప్రతి ఒక్కరి జీవితంలో మంచి రోజులు అని ధనుష్ చెప్పుకుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us