Motta Rajendran : ఆ సినిమాలోనే ఇలా జరిగింది.. జుట్టు ఊడిపోయి.. గొంతు మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

రాజారాణి సినిమాతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు నటుడు మొట్ట రాజేంద్రన్. 67 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ, విలన్‌గా కెరీర్ ప్రారంభించి కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెప్పుకొచ్చారు.

Motta Rajendran : ఆ సినిమాలోనే ఇలా జరిగింది.. జుట్టు ఊడిపోయి.. గొంతు మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
Motta Rajendran

Updated on: Jul 31, 2026 | 9:42 PM

విలక్షణమైన నటనకు, తన ప్రత్యేకమైన రూపానికి పేరుగాంచిన నటుడు మొట్ట రాజేంద్రన్. తమిళంలో పాపులర్ నటుడు. కానీ తెలుగులోనూ విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన వాయిస్, డైలాగ్స్, యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 67 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ యువ నటులకు సైతం స్ఫూర్తినిస్తున్న రాజేంద్రన్, తన ఆరోగ్య రహస్యం, కెరీర్‌లోని ఎత్తుపల్లాలను పంచుకున్నారు. 60 ఏళ్లు దాటిన వయసులోనూ దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని అడగగా, రాజేంద్రన్ ప్రతిరోజూ స్టమక్ వర్కవుట్‌లు చేస్తానని, అది అలవాటుగా మారిపోయిందని తెలిపారు. తన వయసు 67 అని ధృవీకరిస్తూ, తాను చేసే పనిని కరెక్ట్‌గా చేస్తే ఫలితాలు ఆటోమేటిక్‌గా వస్తాయని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

మొట్ట రాజేంద్రన్ జుట్టు కోల్పోవడం వెనుక ఉన్న వాస్తవం చాలా మందికి తెలియదు. ఇంటర్వ్యూలో ఈ విషయంపై అడగ్గా, ఆయన ఆ విషాదకర సంఘటనను వివరించారు. ఒక మలయాళం సినిమా షూటింగ్ సమయంలో, 15 అడుగుల ఎత్తు నుండి నీటిలోకి దూకాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, ఆ నీరు ఫ్యాక్టరీ నుండి వచ్చిన కెమికల్ వ్యర్థాలతో కూడినది అని తెలియదని తెలిపారు. అందులో పడిన తర్వాత చిన్న చిన్నగా జుట్టు, కనుబొమ్మలు మొత్తం ఊడిపోయాయని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. అయితే, ఇదే సంఘటన ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు తిప్పిందని రాజేంద్రన్ చెప్పారు. దర్శకుడు బాలాసర్ తనకు దేవుడు అని ఆయన ప్రశంసించారు. నాన్ కడువల్ (తెలుగులో నేనే దేవుడా) చిత్రంలో విలన్ పాత్రకు తన ఈ కొత్త రూపం ప్లస్ అయ్యిందని, అదే తనను విలన్‌గా నిలబెట్టిందని వివరించారు. ఈ చిత్రంతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించిందని, ఈ మార్పు పట్ల ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.

నాన్ కడువల్ చిత్రంతో విలన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మొట్ట రాజేంద్రన్, ఆ తర్వాత కామెడీ పాత్రలతోనూ ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు రాజేష్ తీసిన బాస్ ఎంగిర భాస్కరన్ (తెలుగులో నేనే అంబానీ) చిత్రంతో కామెడీ టైమింగ్ బయటపడిందని, ఆ తర్వాత రాజారాణి వంటి అనేక చిత్రాలతో కామెడీ నటుడిగా మారానని తెలిపారు. తాను మొదట బలహీనత అని భావించిన తన రూపం, ఇప్పుడు తన బలంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రత్యేకమైన వాయిస్ కూడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెట్టిందని, ప్రజలు దానిని ఇష్టపడుతున్నారని చెప్పారు. రాజారాణిలో హెన్రీ పాత్ర, “సింహం జూలుతో జడేస్తావా?” వంటి డైలాగులు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్..

Loading...
Unable to load recommendations.
Follow Us