
బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ కామెడీ షో జబర్దస్త్ కు పునఃవైభవం తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఈ కామెడీ షోకు వన్నె తెచ్చిన స్టార్ కమెడియన్లు తిరిగి మళ్లీ షోలోకి వస్తున్నారు. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కు జడ్జీగా తిరిగొచ్చాక చాలా మంది స్టార్ కమెడియన్లు ఈ షోలోకి అడుగు పెట్టారు. సినిమాల్లో బిజీగా ఉంటోన్న హైపర్ ఆది, ధనాధన్ ధన్‌రాజ్,సుడిగాలి సుధీర్, చలాకీ చంటి, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి స్టార్ కమెడియన్లతో పాటు సద్దాం, వినోద్ అలియాస్ వినోదిని తదితరులు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీచ్చారు. తమదైన కామెడీ పంచులతో ఆడియెన్స్ కు మంచి వినోదం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ కమెడియన్ చేరాడు. అతను మరెవరో కాదు చమ్మక్ చంద్ర. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తోన్న చమ్మక్ చంద్ర జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తనకు మాత్రమే సాధ్యమయ్యే భార్యభార్తల స్కిట్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజైంది.
కాగా చమ్మక్ చంద్రతో పాటు గతంలో ఇతని టీమ్ లోనే పనిచేసిన సత్తి పండు కూడా జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వీరిని చూసిన నాగబాబు.. ‘ సత్తిపండుని చాలా రోజుల తర్వాత చూశాను.. మధ్యలో ఏదో సీరియస్ అన్నారు’ అని అంటే.. అన్నీ సెట్ చేసే తీసుకువచ్చాను అని చమ్మక్ చంద్ర చెబుతాడు. అలాగే శ్రీదేవీ డ్రామా కంపెనీలో మెరుస్తోన్న నూకరాజు కూడా జబర్దస్త్ లో మెరిశాడు. ‘ఈ మధ్యన ఈఎంఐలు ఎక్కువ అయ్యాయి.. అందుకే జబర్దస్త్ కు వచ్చా’ అని నూకరాజు తనదైన స్టైల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు.
జబర్దస్త్ కామెడీ షోలో స్టార్ కమెడియన్లు అయిన రామ్ ప్రసాద్, నరేష్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో షోలో కామెడీకి ఏ మాత్రం లోటు లేకుండా ఆడియెన్స్ ను నవ్వించేందుకు చమ్మక్ చంద్రను రప్పించినట్టు తెలుస్తోంది. మరి చమ్మక్ చంద్ర పర్మినెంట్ గా జబర్దస్త్ లో కొనసాగుతాడా? లేదా సుధీర్, గెటప్ శ్రీనులా గెస్ట్ అప్పియరెన్స్ కే పరిమితమవుతాడా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి