Ram Charan: రోడ్డు మీద పొట్టు పొట్టు కొట్టుకున్న రామ్ చరణ్ లేడీ ఫ్యాన్స్.. అసలేంజరిగిందంటే

|

Apr 02, 2023 | 3:49 PM

తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు చరణ్. మొన్నామధ్య వచ్చిన రంగస్థలం సినిమాతో నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకున్న చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.

Ram Charan: రోడ్డు మీద పొట్టు పొట్టు కొట్టుకున్న రామ్ చరణ్ లేడీ ఫ్యాన్స్.. అసలేంజరిగిందంటే
Ram Charan
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. చిరంజీవి క్రేజ్ ను ఎక్కడా ఉపయోగించుకోకుండా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు చరణ్. మొన్నామధ్య వచ్చిన రంగస్థలం సినిమాతో నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకున్న చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఇప్పుడు రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చరణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ రోడ్డు మీద పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు.

ఫ్యాన్స్ మధ్యలో చిన్న చిన్న గొడవలు జరగడం మామూలే.. చాలా సార్లు అవి ఘర్షణకు దారితీస్తుంటాయి. తాజాగా రామ్ చరణ్ లేడీ ఫ్యాన్స్ రోడ్డుమీద గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ను ఒక చిన్న మాట అన్నందుకు ఇద్దరు అమ్మాయిలు ఇలా రోడ్డు మీద పడి కొట్టుకున్నారు.

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.