
చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.. ఈ విషయం తెలిసి షూటింగ్ లో ఉన్న చిరంజీవి హుటాహుటిన ఇంటికి వచ్చారని తెలుస్తుంది. అదేవిధంగా తల్లికి బాలేదని తెలిసి.. కేబినెట్ సమావేశం మధ్యలోనే బయటకొచ్చేసి పవన్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లిని కలవనున్నారు. పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
గతంలో చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థత అంటూ వార్తలు వచ్చాయి.. కేవలం చెకప్ కోసమే వెళ్లారు అని అప్పుడు చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తల్లికి అనారోగ్యం అని తెలియగానే సినిమా షూటింగ్ నుంచి చిరంజీవి మధ్యలోనే వెళ్లిపోయారు. పవన్ అటు రాజకీయాలతోపాటు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ఏపీలో మంగళవారం జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో పవన్ భాగం కావాల్సి ఉంది. కానీ తల్లికి అస్వస్థత అని తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు పవన్. అంజనాదేవికి అస్వస్థత అని తెలిసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి