ఆ మూవీని చరణ్ హ్యాండిల్ చేయగలడా అని డౌట్ పడ్డారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని షేక్ చేసింది..

'మగధీర' లాంటి భారీ సినిమాను రామ్ చరణ్ చేయగలడా అని మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు భయపడ్డారట. రాజమౌళి ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

ఆ మూవీని చరణ్ హ్యాండిల్ చేయగలడా అని డౌట్ పడ్డారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని షేక్ చేసింది..
Ram Charan

Updated on: Apr 28, 2026 | 8:30 AM

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, రామ్ చరణ్‌ను ఒక స్టార్ హీరోగా నిలబెట్టింది. అయితే, ఈ సినిమా ప్రారంభానికి ముందు మెగాస్టార్ చిరంజీవి మనసులో ఒక చిన్న సందేహం ఉండేదట. ఈ విషయాన్ని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

ఇది చదవండి: కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..

రాజమౌళి ‘మగధీర’ కథను సిద్ధం చేసుకున్నప్పుడు, అందులోని 100 మందిని చంపే ఎపిసోడ్ చాలా కాలం నుంచి ఆయన మైండ్‌లో ఉంది. ఆ కథను చరణ్‌కు చెబితే బాగుంటుందని భావించి, చిరంజీవికి ఒక రఫ్ లైన్ వినిపించారట. కథ విన్న చిరంజీవి చాలా ఇంప్రెస్ అయ్యారు. కానీ, వెంటనే ఆయనకు ఒక భయం కలిగింది. “చరణ్ అప్పుడే ‘చిరుత’ సినిమా చేశాడు. ఇంతటి భారీ రేంజ్ ఉన్న సినిమాను, ఇంత పెద్ద క్యారెక్టర్‌ను అతడు హ్యాండిల్ చేయగలడా?” అని రాజమౌళిని అడిగారట.

అప్పుడు రాజమౌళి, చరణ్‌లో ఉన్న స్పార్క్‌ను తాను ‘చిరుత’ సినిమా చూసినప్పుడే గమనించానని, అతను ఖచ్చితంగా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని చిరంజీవికి నమ్మకాన్ని ఇచ్చారట. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనందరికీ తెలిసిందే. ‘మగధీర’ విడుదలై ప్రభంజనం సృష్టించింది. చరణ్ తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో తండ్రి భయాన్ని పోగొట్టడమే కాకుండా, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈరోజు చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతుంటే, ఆనాడు రాజమౌళి ఆయనపై పెట్టుకున్న నమ్మకమే పునాది అని చెప్పవచ్చు. కాగా, చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: అప్పు ఇస్తున్నారా.? ప్రామిసరీ నోటు మీద ఇది లేకపోతే.. చిత్తు కాగితంతో సమానం..

Follow Us