ఇది ఇప్పటి వార్ కాదు..!

|

Jan 02, 2020 | 3:17 PM

‘మా’ అనగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు కొత్తేమి కాదు. ఆధిపత్య ధోరణితో అనేకసార్లు రచ్చకెక్కింది ‘మా’. పైకి అందరూ బాగున్నట్టు కనిపిస్తున్నా కోల్డ్‌వార్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఎలక్షన్లప్పుడు అయితే రచ్చ బజారుకు ఎక్కుతుంది. బహిరంగ విమర్శలు,  వ్యక్తిగత ఆరోపణలతో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే వరకు వేడి కొనసాగుతుంది. కానీ అనూహ్యంగా ఈ సారి ‘మా’ డైరీ 2020 ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసకు వేదికైంది. టాలీవుడ్ ప్రముఖులంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో  చిరంజీవిపై రాజశేఖర్ పరోక్ష […]

ఇది ఇప్పటి వార్ కాదు..!
Follow us on

‘మా’ అనగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు కొత్తేమి కాదు. ఆధిపత్య ధోరణితో అనేకసార్లు రచ్చకెక్కింది ‘మా’. పైకి అందరూ బాగున్నట్టు కనిపిస్తున్నా కోల్డ్‌వార్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఎలక్షన్లప్పుడు అయితే రచ్చ బజారుకు ఎక్కుతుంది. బహిరంగ విమర్శలు,  వ్యక్తిగత ఆరోపణలతో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే వరకు వేడి కొనసాగుతుంది. కానీ అనూహ్యంగా ఈ సారి ‘మా’ డైరీ 2020 ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసకు వేదికైంది.

టాలీవుడ్ ప్రముఖులంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో  చిరంజీవిపై రాజశేఖర్ పరోక్ష విమర్శలు గుప్పించారు. అంతేకాదు మైక్ లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. దీనిపై మీడియా సమక్షంలోనే చిరు, రాజశేఖర్ విమర్శానాస్త్రాలు సంధించుకున్నారు. కాగా రాజశేఖర్ వైఖరిని అక్కడే ఉన్న మోహన్ బాబు, కృష్ణంరాజు, మురళిమోహన్‌లు ఖండించారు. అయితే మెగాస్టార్‌కు, రాజశేఖర్‌‌కు మధ్య గతంలోనే విబేధాలున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో చేరుతారా అని రాజశేఖర్ దంపతులను అడిగినప్పుడు..వారు నెగటీవ్ కామెంట్స్ చేశారు. దీంతో కొంతమంది మెగా ఫ్యాన్స్ రాజశేఖర్ ఫ్యామిలీ ప్రయాణిస్తోన్న కారుపై దాడి చేశారు. ఆ తర్వాత చిరు…రాజశేఖర్ ఇంటికి వెళ్లి సారీ చెప్పారు. గతంలో మూవీస్ విషయంలో కూడా ఈ సీనియర్లు పోటీ పడ్డారు. తమిళ సినిమా ‘రమణ’ మూవీకి  రీమేక్‌గా వచ్చిన ఠాగూర్ విషయంలో కూడా ఈ హీరోల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.