Megastar Chiranjeevi: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్.. అందుకే ‘అన్నయ్య’ అందరివాడు

|

Aug 08, 2022 | 5:10 PM

చిరంజీవి సొంత గ్రామమైన మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్ వీరాభిమాని. ఇటీవల నాగరాజుకు రెండి కిడ్నీలు పాడయ్యాయి.

Megastar Chiranjeevi: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్.. అందుకే అన్నయ్య అందరివాడు
Megastar Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుతో సంబంధం లేకుండా చిరును అభిమానించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ స్థానం ప్రత్యేకం. చిరును ఆరాధిస్తూ.. స్పూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారెందరో ఉన్నారు. ఒక్కసారైన ఆయనను కలవాలని చూడాలని ఆరాటపడే అభిమానులు అనేకం. అయితే తాజాగా జీవితంలో ఒక్కసారైన చిరును చూడాలని ఉన్న ఓ అభిమాని కోరిక తీర్చారు మెగాస్టార్.  ప్రాణం కోసం పోరాడుతున్న ఆ అభిమానిని తన నివాసానికి  పిలిచి అప్యాయంగా పలకరించి.. ఆర్థిక సాయం చేశారు.

వివరాల్లోకెలితే.. చిరంజీవి సొంత గ్రామమైన మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్ వీరాభిమాని. ఇటీవల నాగరాజుకు రెండి కిడ్నీలు పాడయ్యాయి. తన చివరి కోర్కెగా తన ఆరాధ్యదైవం చిరంజీవిని కలవాలనుందని మనసులో మాట తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న చిరు.. ఆ అభిమానికి తన నివాసానికి ఆహ్వానించాడు. మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమానిని చూసి చలించిపోయారు. అనంతరం అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. నాగరాజుతోపాటు అతని కుటుంబసభ్యులతో దాదాపు గంటపాటు ముచ్చటించిన చిరు.. మానసిక ధైర్యాన్ని కలిగించడమే కాకుండా.. ఆర్థికసాయం చేశారు. ఇక ప్రస్తుతం చిరు వరుస సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల షూటింగ్స్‏తో తీరిక లేకుండా గడిపేస్తున్నారు.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.