Megastar Chiranjeevi : పంచారామక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె పూజలు.. ఆశీర్వచనం అందించిన అర్చకులు..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. తాజాగా సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని సుష్మిత దర్శించుకున్నారు.

Edited By:

Updated on: Nov 14, 2024 | 12:49 PM

కాకినాడ జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయాన్ని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆమె ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు , తీర్థ ప్రసాదాలు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. ఆమె మాట్లాడుతూ….కార్తీక మాసంలో సామర్లకోట వచ్చి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు…. ఆమె వెంట పలువురు మెగా అభిమానులు దగ్గరుండి ప్రత్యేక పూజ్య కార్యక్రమం చేయించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us