కృతిశెట్టికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందన లేఖ.. ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌వుతున్న హీరోయిన్

ఉప్పెన చిత్రం ఇప్పుడు మంచి ప్రశంసలు అందుకుంటుంది. కొత్త దర్శకుడు, నటీనటులు కలిసి వెండితెరపై మ్యాజిక్ చేశారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి మూవీ కావడంతో ఈ సినిమాపై

  • Ram Naramaneni
  • Publish Date - 10:18 pm, Mon, 22 February 21
కృతిశెట్టికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందన లేఖ.. ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌వుతున్న హీరోయిన్

ఉప్పెన చిత్రం ఇప్పుడు మంచి ప్రశంసలు అందుకుంటుంది. కొత్త దర్శకుడు, నటీనటులు కలిసి వెండితెరపై మ్యాజిక్ చేశారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. ఇక ప్రోమోలు ఎప్పుడైతే రిలీజ్ అయ్యయో.. అప్పుడు వైష్ణవ్ తేజ్‌తో పాటు హీరోయిన్ కృతిశెట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఈ చిన్నదాని అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ప్రస్తుతం విజయోత్సాహంతో ఉన్న ఈ నటి వరుస అవకాశాలు అందుకుంటుంది తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో కూడా చెప్పేస్తుంది.

 

తాజాగా కృతిశెట్టికి చిరంజీవి ఒక లేఖ రాశారు. ఆ లేఖను ట్వీట్ చేసిన కృతిశెట్టి.. చిరంజీవి బంగారు మాటలను జీవితాంతం తన గుండెలో దాచుకుంటానని చెప్పింది. కృతిశెట్టిని ‘బోర్న్ స్టార్’  గా అభివర్ణించిన మెగాస్టార్ చిరంజీవి.. ‘నువ్వు కేవలం స్టార్ అని మాత్రమే కాదు అద్భుతమైన నటివని కూడా నిరూపించుకున్నావు’ అని ప్రశంసించారు. వన్ వీక్‌లోనే భాషను నేర్చుకుని అద్భుతంగా నటించి అద్భుతమైన అమ్మాయిగా కృతిశెట్టి నిరూపించుకుందని ప్రశంసించారు. బేబమ్మపై తమ ప్రేమను, ఆప్యాయతను ఎప్పుడూ ఉంటాయని అన్నారు.

 

చిరంజీవి ప్రత్యేక లేఖను ట్వీట్ చేసిన కృతిశెట్టి.. చిరంజీవి గారికి చాలా కృతజ్ఞతలని.. నిజంగా ఆయన లేఖ నా హృదయాన్ని హత్తుకుందని చెప్పింది. ఆ బంగారు మాటలు ఎప్పటికీ తన మదిలో దాచుకుంటానని చెప్పింది.

 

అమ్మడి అందాన్ని అట మీడియాతో పాటు ఇటు కుర్రకారు కూడా తెగ పొగుడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ ప్రశంసలు కూడా దక్కాయి. అది కూడా ప్రత్యేక లేఖ రూపంలో. దీంతో ఈ హీరోయిన్‌ చాలా హ్యాపీగా ఉందట ప్రజంట్.

 

వింటేజ్ లవ్ స్టోరీగా తెర‌కెక్కి ఆడియెన్స్ మ‌న‌సుల‌ను గెలుచుకున్న చిత్రం ఉప్పెన‌. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాక విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.