Acharya movie : ఖమ్మంలో ఆచార్య మూవీ షూటింగ్.. బొగ్గుగనుల వద్ద భారీగా అభిమానులు.. పోలీసుల బందోబస్త్

 మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు కమర్షియల్ విలువలు,

Acharya movie : ఖమ్మంలో ఆచార్య మూవీ షూటింగ్.. బొగ్గుగనుల వద్ద భారీగా అభిమానులు.. పోలీసుల బందోబస్త్

Updated on: Mar 07, 2021 | 9:38 AM

Acharya movie shooting : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్  ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరగనుంది.ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఇల్లెందులో పర్యటించారు. ఇక్కడి జేకే మైన్స్ లో షూటింగ్ జరిపేందుకు నిర్ణయించారు. అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కూడా ‘ఆచార్య’ చిత్రబృందం కలిసింది. దాంతో మార్చి 7 (నేటినుంచి)మార్చి 15 వరకుషూటింగ్ జరపనున్నారు. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మెగాస్టార్ అలాగే రామ్ చరణ్ వస్తున్నారని తెలియడంతో బొగ్గుగనులవద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు.ఎలాంటి ఆటంకలుగకుండా పోలీసులుభారీ బందోబస్త్ను ఏర్పాటుచేసారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ మంత్రిపువ్వాడ అజయ్ఇంట్లోనే బసచేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

kangana counter : నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి.. ఎప్పటికి చీప్ ఆర్టిస్టువే.. తాప్సీపై విరుచుకుపడిన కంగనా..

Anasuya Bharadwaj : అందాల అనసూయ ‘ఖిలాడి’గా కనిపించనుందా.. నెగిటివ్ రోల్‌‌‌‌‌లో రంగమ్మత్త..?